22 ఏళ్లకే ఐపీఎస్‌ అధికారి.


రాజ్‌కోట్‌: దేశంలోనే అత్యంత యువ ఐపీఎస్‌ అధికారిగా ఓ యువకుడు రికార్డు సృష్టించబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పాలంపూర్‌ పట్టణం కనోదర్‌ గ్రామానికి చెందిన హసన్ సఫిన్‌.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 570 ర్యాంకు సాధించారు. అనంతరం అతడు ఐపీఎస్‌ అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్‌ డిసెంబర్‌ 23న జామ్‌నగర్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా హసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. '



నాకు ఐఏఎస్‌ అధికారి కావాలని లక్ష్యం ఉండేది. కానీ అది కుదరకపోవడంతో చివరకు ఐపీఎస్‌గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నా.

నా తల్లిదండ్రులు ముస్తఫా హసన్‌, నసీంభా ను ఇద్దరూ ఓ వజ్రాల కంపెనీకి సంబంధించిన చిన్న యూనిట్‌లో పనిచేస్తుంటారు. నా విద్యాభ్యాసం కోసం వారు ఎంతో శ్రమించారు. వారితో పాటు అతడి కల నెరవేరడానికి పలువురు వ్యాపారులు ఆర్థిక సాయం చేసినట్లు' చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "22 ఏళ్లకే ఐపీఎస్‌ అధికారి."

Post a Comment