జనవరి 8న దేశవ్యాప్త సమ్మె

పోస్టర్‌ ఆవిష్కరించిన నాయకులు
రాజమహేంద్రవరం: జనవరి 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఏవీ నాగేశ్వరరావు, ఇతర నాయకులు ఆవిష్కరించారు. బుధవారం స్థానిక సీటీఆర్‌ భవన్‌లో సీఐటీయూ డివిజన్‌ సమావేశం కేఎన్‌వీ రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 



కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు సీఐటీయూతోపాటు 11 కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు, 15 స్వతంత్ర సంఘాలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వరంగ పరిశ్రమలు, బ్యాంకులు, బీమా, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గ్రామీణ బంద్‌ కూడా పాటిస్తున్నారని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి మాట్లాడుతూ ప్రధానంగా 14 డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారని అన్నారు. కార్మికుల కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, వీడీఏ చెల్లించాలని, అధిక ధరలు అరికట్టాలని తదితర డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సత్తిరాజు, లవకుమార్‌, రాము, వెంకటేశ్వరరావు, పూర్ణిమరాజు, రామారావు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " జనవరి 8న దేశవ్యాప్త సమ్మె"

Post a Comment