6,740 అంగన్‌వాడీ కేంద్రాలకు
పక్కా భవనాలు
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
* ఒక్కో భవనానికి రూ.7.50 లక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 6,740 అంగన్‌వాడీ కేంద్రాలకు
పక్కా భవనాలు సమకూరనున్నాయి. కొత్త సంవత్సరంలో వీటి
నిర్మాణాలకు జిల్లా కలెక్టర్లు టెండర్లు ఆహ్వానించనున్నారు. రూ..50
లక్షల వ్యయంతో ఒక్కో భవనం నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు
త్వాలు నిధులు కేటాయించాయి. వీటికితోడు గత ప్రభుత్వం ప్రారం
భించి మధ్యలో ఆపివేసిన నాలుగు వేల భవనాల నిర్మాణాలను రాష్ట్ర
పూర్తి చేయనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం
10,740 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు అందుబాటులోకి
తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో
55,40 కేంద్రాలు ఉండగా 28,559 అద్దె గృహాల్లో నడుస్తున్నాయ.
20,621 కేంద్రాలకు ప్రభుత్వ భవనాలు ఉండగా మిగిలిన 11,427
కేంద్రాలు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నాయి.
అన్ని కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు అనువుగా కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వం
నాలుగు వేల కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు టెండర్లు
ఆహ్వానించింది. వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ
పథకం నిధులు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా
నిధులను ఇతర ప్రజాకర్షక పథకాలకు మశ్లించడంతో అవన్నీ అసం
పూర్తిగా నిలిచిపోయాయి. వాటితోపాటు కొత్తగా మంజూరు చేసిన
భవనాలను కూడా 220 డిసెంబరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
టెండర్లు ఆహ్వానిస్తున్న జిల్లా కలెక్టర్లు
నిర్ణీత కాలవ్యవధిలో వీటి నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యతను జిల్లా
కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అవసరమైన స్థలాలను ఎంపిక
చేయడంతో పాటు టెండర్ల ఆహ్వానానికి చర్యలు లీసుకుంటున్నారు.
పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖలకు వీటి నిర్మాణ బాధ్యత
లను అప్పగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు ముందుకు
రాని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని భవనాల
నిర్మాణాలకు స్వచృంద సంస్థల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం
సూచించింది. విద్యాశాఖలో పాఠశాలల నిర్మాణాలు, మరమ్మతులకు
(నాడు-నేడు) దాతలు, స్వచృంద సంస్థల సహకారాన్ని తీసుకుం
టున్న విధంగానే వీటి నిర్మాణానికీ తీసుకోవాలని కలెక్టర్లకు
ప్రభుత్వం సూచించింది. కాగా, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన
6,740 భవనాలతో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించినవీ నిరీ
త కాలవ్యవధిలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని
రాష్ట్ర స్త్ర, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్
0 Response to "6,740 అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు"
Post a Comment