SBI షాకింగ్: వడ్డీ రేటును భారీగా తగ్గింపు, దేనిపై ఎంత అంటే?

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు తగ్గించింది. 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు FDలకు ఇది వర్తిస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే రాబడి మరింత తగ్గనుంది. రూ.2 కోట్లకు పైన గల బల్క్ డిపాజిట్ పైన కూడా వడ్డీ రేటును తగ్గించింది. వీటిపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

ఎస్బీఐకి అవసరమైన ద్రవ్యలభ్యత ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ తగ్గింపు నిర్ణయం నవంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను కూడా తగ్గించింది



ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది.

SBI తాజా వడ్డీ రేట్లు

సాధారణ కస్టమర్లకు FD వడ్డీ రేటు

- 7 రోజుల నుంచి to 45 రోజుల వరకు 4.50%

- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 5.50%

- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.80%

- 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 5.80%

- 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.25%

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.25%

- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.25%

- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.25%


సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేటు

- 7 రోజుల నుంచి to 45 రోజుల వరకు 5.00%

- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 6.00%

- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 6.30%

- 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 6.30%

- 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.75%

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.75%

- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.75%

- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.75

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "SBI షాకింగ్: వడ్డీ రేటును భారీగా తగ్గింపు, దేనిపై ఎంత అంటే?"

Post a Comment