చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు నేటి వరకు అవకాశం
*🌼గుంటూరు*
*♦చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు నేటి వరకు అవకాశం*
*🔸ప్రభుత్వం ప్రకటించిన అమ్మఒడి పథకం చైల్డ్ ఇన్ఫోలో నమోదు కోసం బుధవారం వరకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.*
*🔹ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం చైల్డ్ ఇన్ఫోలో పేరు నమోదు కోసం విద్యార్థుల నుంచి సమాచారం సేకరించాలని సూచించారు.*
*🔸అమ్మఒడి పథకంలో ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పా టు చేస్తున్నట్లు డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని పేర్కొన్నారు. ఈసెల్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు.*
*🔹అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన సెల్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని ఆమె వివరించారు.*
*🔸అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ యాజమాన్యాలు సెల్ ద్వారా సమాచారం పొందవ చ్చునని పేర్కొన్నారు. సెల్ నెంబర్లు 76710 08007, 99089 79775, 96527 82919, 95025 47695, 9347310671, 94913 37601, 0864-2271784లో సంప్రదించాలని సూచించారు.*
*🔹ఈనెల 20 తేదీ వరకు సెల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.*
🍃🍁🍃🍁🍃🍁
0 Response to "చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు నేటి వరకు అవకాశం"
Post a Comment