అధిక ధరలకు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?

అధిక ధరలకు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?

 విద్యాశాఖ అధికారుల్ని
ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని (పైవేటు పాఠశా
లల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు
(యూనిఫామ్‌) విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని విద్యా
శాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహా
రమై ఏమి చర్యలు తీసుకున్నారో వివరణ ఇస్తూ ప్రమా
ణపత్రాలు దాఖలు చేయాలని పాఠశాల విద్య ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,
రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదే
శించింది. విచారణను రెండు వారాలకు వాయిదా
వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే
మహేశ్వరి, జస్టిస్‌ ఎం. గంగారావులతో కూడిన ధర్మా

సనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
' ఏపీ విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రం

లోని పలు పైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారని
పేర్కొంటూ ముందడుగు ప్రజాపార్దీ ప్రధాన కార్యదర్శి
న్యాయవాది ఎన్‌ఎన్‌ గ్రేస్‌ హైకోర్టులో ప్రజాహిత
వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. (పైవేటు
పాఠశాలల్లో అధిక రుసుములు వసూలు చేస్తున్నారని,
పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను అధిక ధరలకు విక్రయి
స్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అక్రమ నిర్మాణాల పై మరోసారి నోటీనులు

కృష్ణానది తీరప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2011/లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో పలువురు నిర్మాణదారులకు హైకోర్టు మరో సారి నోటీసులు జారీచేసింది. ఇప్పటికే నోటీసులు అందు కున్న నిర్మాణదారులు, ప్రభుత్వం ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను ఆరు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. ఉండవల్లి, పెనుమాక, తది తర గ్రామాలపరిధిలోని కృష్ణానది తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసు కోలేదని పేర్కొంటూ వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో హైకోర్టును ఆశ్రయించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అధిక ధరలకు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?"

Post a Comment