మాజీ సీఈసీ టీఎన్‌ శేషన్‌ కన్నుమూత

చెన్నై: ఎన్నికల సంస్కర్తగా ప్రసిద్ధి చెందిన కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)టీఎన్‌ శేషన్‌(87)గుండెపోటుతో కన్నుమూశారు. 1990-96 సంవత్సరాల మధ్య ఆయన భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు.1932లో కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో శేషన్‌ జన్మించారు. పాలక్కాడ్‌లో పాఠశాల విద్య, మద్రాస్‌ క్రిస్టియన్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా తన 


పదవీకాలంలో ఎన్నికల్లో భారీగా సంస్కరణలు అమలు చేసిన వ్యక్తిగా శేషన్‌ తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డును ప్రవేశపెట్టారు

ప్రచార వేళల కుదింపు, ఎన్నికల వ్యయం నియంత్రణ వంటి సంస్కరణలు తీసుకువచ్చారు.1989లో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా శేషన్‌ సేవలు అందించారు. 1996లో రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్నారు. ఎన్నికల నిమయావళిని కఠినంగా అమలు చేయడంలో ఆయనకు మరెవరూ సాటిరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మాజీ సీఈసీ టీఎన్‌ శేషన్‌ కన్నుమూత"

Post a Comment