హెడ్‌ఫోన్సే స్పీకర్స్‌గా మారితే.
వాషింగ్టన్ : మనం వాడే హెడ్‌ఫోన్సే స్పీకర్స్‌గా మారితే ఎలా ఉంటుంది..? స్పీకర్ల కోసం ప్రత్యేకంగా ఇంకో డివైజ్ వాడాల్సిన అవసరం ఉండదు కదా..! ఒకే డివైజ్ అటు స్పీకర్‌గా.. ఇటు హెడ్‌ఫోన్‌గా పనిచేస్తే వినియోగదారులకు ఎంతో హాయిగా ఉంటుంది కూడా. ఆ కలను నిజం చేసే దిశగా టెక్ దిగ్గజం యాపిల్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే దీనిపై పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే యాపిల్ ఇందుకోసం రెండు పేటెంట్లను యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ కార్యాలయంలో నమోదు చేసుకుంది. ఇందులో ఒకటి 'డ్యూయల్ మోడ్ హెడ్‌ఫోన్స్'. ఇందులో ఇయర్ కప్స్ పొజిషన్ మార్చుకోవడం ద్వారా అవి స్పీకర్లుగా మారుతాయి
ఇయర్ కప్స్ లోపలికి ఉన్నప్పుడు అవి సాధారణ హెడ్‌ఫోన్స్‌లా పనిచేస్తాయి. బయటకి ఉంటే అవి స్పీకర్లుగా మారిపోతాయి. స్పీకర్ మోడ్‌లో ఉన్నప్పుడు అందులోని యాంపిఫ్లయర్ పెద్ద శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అదే హెడ్‌ఫోన్స్ మోడ్‌లో ఉంటే ఇది టర్న్‌ఆఫ్‌లో ఉంటుంది.
ఈ డివైజ్ దానంతటదే పనిచేసేలా రూపొందిస్తున్నారని సమాచారం. డివైజ్‌ను చెవికి దగ్గరగా ఉంచగానే.. ఇందులోని స్పీకర్ మోడ్ పనిచేయదు. ఇందుకోసం ప్రత్యేకమైన సెన్సర్లను అమర్చుతున్నారు. యాపిల్ సంస్థ రూపొందించిన 'ఐపాడ్' ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వినూత్న ఉత్పత్తితో మరోసారి ఆడియో ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు ఈ టెక్ దిగ్గజం
0 Response to "హెడ్‌ఫోన్సే స్పీకర్స్‌గా మారితే."
Post a Comment