హైదరాబాద్ దేశ రెండో రాజధాని అవుతుందేమో!
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు
నారాయణగూడ, న్యూస్‌టుడే: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. అక్కడి పరిస్థితులను చూస్తుంటే డా.అంబేడ్కర్ కోరుకున్నట్లుగా బహుశా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. తెలుగు వర్సిటీలో యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో డా.శ్రీధర్‌రెడ్డి రచించిన 'శ్రీధర్ కవితా ప్రస్థానం' కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు
మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని విద్యాసాగర్ రావు అభిలషించారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, రచయిత్రి ముక్తేవి భారతి, ప్రజాకవి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు
0 Response to "హైదరాబాద్ దేశ రెండో రాజధాని అవుతుందేమో!"
Post a Comment