ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ఫీజు చెల్లింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ఇంటర్మీడియట్‌ 2019-20 విద్యాసంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫీజును విద్యార్థులే నేరుగా చెల్లించే అవకాశం ఇంటర్మీడియట్‌ బోర్డు కల్పించింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాళ్లకు ఫీజు చెల్లించేవారు. అలా కాకుండా విద్యార్ధులే నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించేలా ఇంటర్మీడియట్‌ బోర్డు రూపొందించింది. bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా విద్యార్ధులు లాగిన్‌ అయి పే ఎగ్జామినేషన్‌ ఫీ క్లిక్‌ చేయాలి. విద్యార్థి ఆధార్‌ నెంబర్‌ను యుజర్‌ ఐడిగా నమోదు చేసి ఫర్‌గట్‌ పాస్‌వర్డ్‌ను క్లిక్‌ చేస్తే మొబైల్‌ ఫోన్‌కు ఓటిపి వస్తుంది


దీని ద్వారా లాగిన్‌ను ఉపయోగించి శుక్రవారం నుంచి ఫీజు చెల్లించే ఏర్పాటు చేశామని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ తెలిపారు. జనరల్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు రూ.490, ఒకేషనల్‌ రూ.680గా బోర్డు నిర్ణయించింది. రెండో ఏడాది జనరల్‌ (సైన్స్‌) విద్యార్థులకు రూ.680, ఆర్ట్స్‌ విద్యార్ధులకు రూ.490, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ.680గా బోర్డు నిర్ణయించింది. దరఖాస్తు రూ.10 అందరూ చెల్లించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ఫీజు చెల్లింపు"

Post a Comment