తెలుగు లేని సంఘం యేల?

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మాతృభాషలోనే బోధన లేనప్పుడు సంఘం ఎందుకు? పిల్లల బడిలో అమ్మభాష రద్దయినప్పుడు ఆ ‘అధికారం' ఎవరికోసం? తెలుగు పునాదులే కదిలిపోతుండగా, ఇక అధ్యక్ష పీఠాలు ఉండేం లాభం?.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో.. అధికార భాషా సంఘంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నల సరళి ఇదీ! ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ అంశమే హల్‌చల్‌ రేపుతోంది. 1974లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనా రంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. మాతృభాషను కాపాడుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు అధికార భాషా చట్టాలు ఏర్పాటుచేసుకొన్నాయి. తెలుగు నుడికి గుడి కడుతూ.. ఏపీలోనే మొదటగా 23 శాఖలతో మండలం, దాని కన్నా తక్కువ స్థాయిలోని కార్యాలయాలలో అమ్మభాషను తప్పనిసరి చేయడం జరిగింది.
 
1974 నుంచి 1979 వరకు రాష్ట్ర స్థాయిలో తెలుగు అమలు విషయమై ప్రభుత్వ ఉత్తర్వులు జారీఅయ్యాయి. 1983లోముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుకు వెలుగు పెరిగింది. అప్పట్లో ప్రభుత్వ శాఖలు మాతృభాషలోనే ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ దశలన్నింటిలోనూ తెలుగు భాష విశిష్ఠతను భావితరాలకు వివరించేందుకు, పూర్తి స్థాయిలో జవసత్వాలు కల్పించేందుకు అధికార భాషా సంఘం ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించింది. అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య పనిచేశారు. ఇప్పటి వరకు 14 మంది అధ్యక్షులుగా వ్యవహరించి తెలుగు భాషాభివృద్ధికి కృషి సల్పారు. అలాంటి విశిష్ఠ సంఘం ఉనికి ‘ఇంగ్లిష్‌ మీడియం’ జీవోతో ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " తెలుగు లేని సంఘం యేల? "

Post a Comment