ఉద్యోగుల దశల వారీ ఆందోళన
- ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన ఏపీజేఏసీ
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సకాలంలో 11వ వేతన సవరణ అమలు, 3 విడతల డీఏ బకాయిల మంజూరు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హెల్త్‌కార్డుల వంటి ప్రధాన సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం జాప్యం చేస్తున్న నేపథ్యంలో దశల వారీగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఇన్‌చార్ట్ సీఎస్ నీరజ్‌కుమార్ ప్రసాద్‌ను కలిసి ఈ నెల 20 నుంచి ఏపీ ఉద్యోగు ల జేఏసీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నోటీసు ఇచ్చారు. ఈ నెల 20న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, భోజన విరామం సమయంలో ప్రదర్శన, 26న తాలూకా కేంద్రాల్లో ధర్నా, డిసెంబరు 10న జిల్లా కేంద్రాలు, 20న రాజధానిలో ధర్నాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి జోక్యం తగదు
తాము తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతు కానీ, పాల్గొనాలని కానీ తాము కోరకుండానే.. పాల్గొనేది లేదని తమ ఆందోళనపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించడం సరికాదని ఏపీ జేఏసీ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ సుధీర్‌బాబు అన్నారు
0 Response to "ఉద్యోగుల దశల వారీ ఆందోళన"
Post a Comment