ఇక డిజిటల్‌ వైద్యం

 
రాజేశ్‌ ఆఫీస్‌ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లాడు. తన టీమ్‌తో కలిసి వారం రోజులపాటు అక్కడే గడపాల్సి వచ్చింది. షుగర్‌ వ్యాధిగ్రస్తుడైన రాజేశ్‌ అక్కడ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు. సహచరులు దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించగా రాజేశ్‌ అక్కడి వైద్యులకు ఒక నంబర్‌ను చెప్పాడు. అంతే ఒక్క క్లిక్‌తో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ వైద్యులకు తెలిసిపోయాయి. వెంటనే చికిత్స ప్రారంభించడంతో రాజేశ్‌ త్వరగా కోలుకున్నాడు. ఇంతకీ ఏమిటీ నంబర్‌..? దానితోనే ఓ వ్యక్తి ఆరోగ్య సమాచారం మొత్తం తెలిసిపోతుందా..? ఇది సాధ్యమేనా..? అంటే ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌’తో అది సాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం.
  • ప్రతి ఒక్కరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య.. అరచేతిలో రోగుల ఆరోగ్య సమాచారం
  • ఆన్‌లైన్‌ సమాచార వ్యవస్థలన్నీ ఒకే గూటికి
  • నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌ సిద్ధం
గుంటూరు (మెడికల్‌), నవంబరు 24: ఏదైనా జబ్బు చేస్తే చికిత్స కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడం సహజం. ఈ క్రమంలో పలువురు డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారైతే గతంలో తీసుకున్న చికిత్స, వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారం తెలియజేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్టులు ఉంటే ఫర్వాలేదు. కానీ.. అందరూ గత ఆరోగ్య సమాచారాన్ని భద్రపరుచుకోలేరు. గ్రామీణ ప్రాంతాల వారికి ఇది మరీ కష్టం. పాత సమాచారం లేని కారణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు మళ్లీ చేయించాల్సి ఉంటుంది. రోగికి ఇది ఆర్థిక భారమే! ఇలాంటి పరిస్థితుల్లో రోగికి సంబంధించిన వైద్య సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించిన కేంద్రం నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌ (ఎన్‌డీహెచ్‌బీ)ని అందుబాటులోకి 

దేశంలోని ప్రజలందరి వైద్య, ఆరోగ్య వివరాలను డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేసి, వాటిని ఎప్పుడైనా, ఎక్కడైనా వినియోగించుకోవాలో సూచించే విశిష్ట ప్రణాళికే ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌’. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక విశిష్ట ఆరోగ్య సంఖ్య (యూనిక్‌ హెల్త్‌ ఐడెంటి ఫయర్‌)ను కేటాయించి దానిమీద వారి ఆరోగ్య వివరాలన్నీ నిక్షిప్తం చేస్తారు. ఎన్‌డీహెచ్‌బీ రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తుది నివేదికను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. ఈ నిపుణుల కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఏపీ హెల్త్‌ మెడికల్‌ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జంధ్యాల సత్యనారాయణ వ్యవహరించడం విశేషం. వచ్చే ఐదేళ్లల్లో దేశవ్యాప్తంగా దీని అమలుకు మార్గదర్శకాలను ఈ నివేదికలో పొందుపర్చారు.
 
ఇవీ ప్రయోజనాలు..
నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌ అమల్లోకి వస్తే వైద్య రంగంలో పలు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు గుండె జబ్బులు, కేన్సర్‌, పక్షవాతం తదితర మరణాలు సంభవిస్తున్నా దేశంలో ఈ జబ్బులతో ఎంత మంది మృతి చెందుతున్నారో ఖచ్చితంగా తెలియదు. ఇకపై రోగి వివరాల డిజిటలీకరణ వల్ల అన్ని ప్రాణాంతక వ్యాధులకు రిజిస్ట్రి అమల్లోకి వస్తుంది. దీని వల్ల ఏ వ్యాఽధితో ఎంత మంది రోగులు మృతి చెందారో వంద శాతం కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆయా వ్యాధుల కట్టడికి ఎంత మేరకు ప్రాధాన్యమివ్వాలో తెలుస్తుంది. మాతా, శిశు మరణాల రేటు, టోటల్‌ ఫెర్టిలిటీ రేటు (టీఎ్‌ఫఆర్‌), వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు, పౌష్టికాహార లోపం, వివిధ వ్యాధుల కట్టడి వంటి పలు అంశాలపై స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఇంకా పలు వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సహాయం తీసుకొనేందుకు డిజిటల్‌ బ్లూప్రింట్‌లో అవకాశం ఉంటుంది.
 
వైద్యసేవలన్నీ ఒకే గొడుగు కిందకు
ప్రస్తుతం అన్ని స్థాయిల్లో వేర్వేరు వైద్య విధానాల సమాచారం సేకరణ, వైద్య సేవలు డిజిటల్‌ విధానం ద్వారా ఒకే గొడుగు కిందకు వస్తాయి. దీనివల్ల దేశంలో ప్రతి రోగికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి, ఆరోగ్య సమాచారాన్ని డిజిటలీకరణ చేస్తారు. ప్రతి రోగి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే క్రమంలో.. వ్యక్తిగత వివరాలతోపాటు గత చికిత్స వివరాలు, ఎక్స్‌రే, స్కానింగ్‌ రిపోర్డులతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ అప్‌లోడ్‌ చేస్తారు. ఎన్‌డీహెచ్‌బీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టర్షియరీ కేర్‌ హాస్పిటల్‌ (ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రులు) వరకు లింకేజీ ఉండడం వల్ల రోగుల సమాచారం ఫింగర్‌టి్‌పపై వైద్యులు తెలుసుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక డిజిటల్‌ వైద్యం"

Post a Comment