ఉచితంగా ప్యాన్ కార్డు పొందండి.. కేవలం 10 నిమిషాల్లోనే
ఉచితంగా ప్యాన్ కార్డు పొందటం ఏంటని అనుకుంటున్నారా.? మీరు వినేది నిజమే.. ఇంటి దగ్గర నుంచి కేవలం 10 నిమిషాల్లో ప్యాన్ కార్డును పొందొచ్చు. ఇకపై ప్యాన్ కార్డు కోసం 15 రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ ద్వారా జస్ట్ పది నిమిషాల్లో ప్యాన్ కార్డు పొందే అవకాశాన్ని ఐటీ శాఖ ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి వస్తుంది. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివరాలు ప్రకారం ఈ-ప్యాన్ కార్డు జారీ చేయాలని ఆదాయపన్ను శాఖ విధివిధానాలను రూపొందిస్తోంది.
ఈ కొత్త విధానం రావడం వల్ల కేవలం 10 నిమిషాల్లోనే ప్యాన్ కార్డు ఆన్లైన్ ద్వారా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్యాన్‌ను మనం ఉచితంగా పొందవచ్చు.
ఈ-ప్యాన్ కార్డును పొందాలంటే మొదటగా మీ ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. ఇక ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ ఆధార్ వివరాలు వెరిఫై అయ్యి.. ఈ-ప్యాన్ కార్డు జారీ అవుతుంది. దీనికి ఎలాంటి డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ సైతం ఆధార్ డేటాబేస్‌లో ఉండటం వల్ల ప్రత్యేకంగా వేరే వివరాలను వెల్లడించాల్సి అవసరం లేదు
0 Response to "ఉచితంగా ప్యాన్ కార్డు పొందండి.. కేవలం 10 నిమిషాల్లోనే"
Post a Comment