రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్రశిక్ష
ఆంధ్రప్రదేశ్, అమరావతి
ఫిట్ ఇండియా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న
“శారీరక సౌష్టవ వారోత్సవాలు”
02-12-2019 నుంది 07-12-2019)
మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోను, ఎయిడెడ్ పాఠశాలల్లోను, (ప్రైవేటు అన్
ఎయిడెడ్ పాఠశాలల్లోను మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లో గల ప్రాథమిక, ప్రాథమికోన్నత
మరియు ఉన్నత పాఠశాలల్లో ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా శారీరక సౌష్టవ వారోత్సవాలు అనే కార్యక్రమం
జరపడానికి సమగ్రళశిక్ష ఆంధ్రప్రదేశ్ సంకల్పించింది.
2. ఏదైనా సమాజం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే, ఆ పౌరులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం
ముఖ్యం. ఆధునిక జీవితంలోని సవాళ్లను వాంఛనీయశక్తి మరియు సానుకూలతతో ఎదుర్కోవటానికి మరింత
శారీరకంగా చురుకుగా ఉండవలసిన అవసరం ఉంది. ధృడంగా ఉన్న పిల్లలు రోజువారీ శారీరక మరియు
మానసిక సవాళ్లను చక్కగా నిర్వహించగలుగుతారు. ఏదేమైనా సంపూర్ణమైన మరియు అంతర్గతంగా ఆరోగ్యకరమైన
జీవనశైలి, అవగాహన మరియు శరీర ధారుద్యము ఈ రోజుల్లో చాలా అవసరము. ఇందు మూలముగా నిర్వహిస్తున్న
ఈ శారీరక సౌష్టవ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు అత్యంత అవసరం.
3. 29 ఆగష్టు 2019 న, గౌరవ ప్రధానమంత్రి రోజువారీ జీవితంలో మరియు రోజువారీ దినచర్యలలో
శారీరక శ్రమ మరియు క్రీడలను ప్రోత్సహించడానికి ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా “ఫిట్ ఇండియా
ఉద్యమం” ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రతి సంవత్సరం నవంబరు నెలలో
మొత్తం 06 పనిదినాలు ఈ శారీరక సౌష్టవ ఉద్యమానికి ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో “శారీరక సౌష్టవ
వారోత్సవాలు” గా జరుపుకోవాలని సమగ్రళశిక్ష పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. అందువల్ల ఈ
ఉద్యమం బాలబాలికలలో ఉన్న మందబుద్ధిని మరియు నిషియాత్మక ప్రవర్తనను తొలగించి ఉత్తేజపూరితులుగా
మార్చడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడానికి విద్యార్థులందరిలో ఆటలయందు
ఆసక్తిని పెంపొందించడానికి దోహదకారి అవుతుంది. ఇటువంటి కదలిక విద్యార్థులలో క్రమమైన శారీరక శ్రమ
మరియు శారీర ధారుడ్యం పై అవగాహన, ఆత్మగౌరవం మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కార్యక్రమం
6
యొక్క ఆరు రోజుల కార్యాచరణ మరియు కృత్యాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడం జరిగింది.
ఆరు రోజుల కార్యాచరణ
6 మొదటి రోజు చేయవలసిన కృత్యం
CLICK HERE TO DOWNLOAD
(అ) ఉదయం అసెంన్లీ-యోగా
(ఆ) విద్యార్థులు మరియు సిబ్బందికి శారీరక ధారుడ్యం మరియు పోషణపై అవగాహన
0 Response to "రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్రశిక్ష ఆంధ్రప్రదేశ్, అమరావతి ఫిట్ ఇండియా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న “శారీరక సౌష్టవ వారోత్సవాలు” 02-12-2019 నుంది 07-12-2019) మార్గదర్శకాలు"
Post a Comment