గ్రహశకలాలకు మన పేర్లు

ఇటీవల బుధ... గురు గ్రహాలకు మధ్యన కనుగొన్న గ్రహశకలానికి ప్రముఖ సంగీతకారుడు పండిట్‌ జస్‌రాజ్‌ పేరు పెట్టింది 'ఇంటర్నేషనల్‌ ఆస్ర్టోనామికల్‌ యూనియన్‌' (ఐఏయూ)! ఓ గ్రహశకలానికి భారతీయ సంగీతకారుడి పేరు నిర్ణయించడం ఇదే తొలిసారి. అద్భుతాలకు నెలవైన అంతరిక్షంలో గ్రహశకలాలు కనుగొనడం కొత్తేమీ కాదు కానీ... వాటికి పేర్లు నిర్ణయించే ప్రక్రియే కాస్త ఆసక్తి కలిగిస్తుంది. 2006 నవంబర్‌ 11న అమెరికా 



ఆరిజోనాలోని 'కేటలినా స్కై సర్వే' కనుగొన్న ఈ 'పండిట్‌ జస్‌రాజ్‌'... బుధ- గురు గ్రహాల మధ్యనున్నట్టు ఐఏయూ తెలిపింది. పండిట్‌ జస్‌రాజ్‌ కన్నా ముందు మరికొందరు భారతీయులు ఈ గౌరవం దక్కించుకున్నారు
  • 2010లో కనుగొన్న '21575' కోడ్‌ నెంబర్‌ గల గ్రహశకలానికి పుణే విద్యార్థిని హంసా పద్మనాభన్‌ పేరు పెట్టారు. అప్పుడామె బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ గౌరవం దక్కించుకున్న ఆరో భారత విద్యార్థిని 'హంస'. దబార్ఘ్య సర్కార్‌, అనీష్‌ ముఖర్జీ, హేటల్‌ వైష్ణవ్‌, విష్ణు జయప్రకాష్‌, రిషిన్‌ బెహ్ల్‌ మిగిలిన విద్యార్థులు.
  • 2008లో '5718 సీడీ4' గ్రహశకలానికి కేరళలోని కొల్లామ్‌కు చెందిన సైంటిస్ట్‌ డాక్టర్‌ సైనుద్దీన్‌ పట్టాళి పేరు నిర్ణయించారు.
  • 2002లో 17 ఏళ్ల జైపూర్‌ విద్యార్థి అక్షత్‌ సింఘాల్‌ పేరును
  • ఓ గ్రహశకలానికి పెట్టింది. 'మైక్రోసాఫ్ట్‌ సిస్టమ్స్‌ సర్టిఫైడ్‌ ఇంజనీర్‌'గా గుర్తింపు పొందిన అతిపిన్న భారతీయుడిగా సింఘాల్‌ పేరిట రికార్డు ఉంది.
  • భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరును 1988లో కనుగొన్న గ్రహశకలానికి పెట్టింది. జపాన్‌కు చెందిన కెంజో సుజుకీ దీన్ని కనుగొన్నారు.
  • 2002లో మరో గ్రహశకలానికి మాధవ్‌ పాథక్‌ పేరు నిర్ణయించారు. బ్రెయిలీ లిపిని సులభతరం చేసిన ఘనుడు మాధవ్‌.

ఎవరిస్తారీ పేర్లు...

'అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌' గ్రహశకలాలకు పేర్లను నిర్ణయిస్తుంది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలకు పదేళ్లలోపు పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిపాదించిన పేర్లన్నింటిలో ఒకదాన్ని 15 మంది సభ్యులతో కూడిన ఐఏయూ ప్రతినిధులు ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో దాదాపు 8 లక్షల గ్రహశకలాలను గుర్తించారు. వాటిల్లో 5,41,131 గ్రహశకలాలకు కోడ్‌ నంబర్లు కేటాయించారు. ఇందులో పేర్లు పెట్టినవి సుమారు 15 వేలు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రహశకలాలకు మన పేర్లు"

Post a Comment