అంతరిక్షంలో కూడా కనిపించనున్న శ్రీవారు....
భూమండలంలోనే కాదు అంతరిక్షంలో కలియుగ దైవం అయిన ఏడుకొండలవాడు పేరు మార్మోగనుంది. త్వరలో అంగారకుడు పై శ్రీవారి పేరు చేరనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఆయన లేని చోటు లేదు. ఆయన విశ్వవ్యాప్తంగా పేరు పొందిన వాడు. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువైన శ్రీవేంకటేశ్వరుడి పేరు ఇప్పుడు మార్స్ పైకి చేరనుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టినా మాస్ ప్రయోగానికి సంబంధించిన రోవర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను ఓ మైక్రోచిప్ లో నిక్షిప్తం చేసి అంగారకుడి పైకి పంపనుంది.
దీనికి సెండ్ యువర్ నేమ్ టూ మాస్ పేరిట సెప్టెంబర్ ముప్పై వరకు నాసా పేర్లను ఆహ్వానించింది
నాసా ఆహ్వానానికి స్పందించి కోటి మందికి పైగా ప్రజలు పలు పేర్లను పంపించారు. వాటిలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పేరు ఉండటం విశేషం. నేషనల్ మిషన్ ఆఫ్ మ్యానుస్ర్కిప్ట్ మాజీ డైరెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి నాసా వెబ్ సైట్ లో శ్రీ వారి పేరును ప్రతిపాదించారు. నాసా మార్స్ మిషన్ ప్రయోగం రెండు వేల ఇరవై జూలైలో జరగనుంది. ఈ వ్యోమనౌక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో అంగారక గ్రహం పైకి చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్ పై అతికించిన మైక్రో చెప్పులపై స్టెన్సిల్ చేసినా పది మిలియన్ల పేర్లలో వెంకటేశ్వరస్వామి పేరు ఉంటుందని అమెరికా అంతరిక్ష సంస్థ పేర్కొంది
0 Response to "అంతరిక్షంలో కూడా కనిపించనున్న శ్రీవారు...."
Post a Comment