1998 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట

మెరిట్ అభ్యర్థులకు నాలుగువారాల్లో ఉద్యోగాలివ్వాలి -అవసరమైతే సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించాలి -హైకోర్టు ఆదేశాలు -నలుగురు డీఈవోలకు శిక్షపై స్టే హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డీఎస్సీ-1998 నియామకాలకు సంబంధించిన కేసులో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 2011లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలుచేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇందుకు నాలుగు వా రాల గడువు ఇచ్చింది. మెరిట్ అభ్యర్థులకు ఆ లోపు 



ఉద్యోగాలివ్వాలని, అవసరమైతే సూప ర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని ఆదేశించింది. ఈ కేసులో పోరాడుతున్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్‌బెంచ్ తీర్పుతో ఊరట లభించినట్లయింది. ఇదేకేసులో కోర్టు ధిక్కరణ కిం ద నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ డీఈవోలకు విధించిన శిక్షపై స్టే విధించింది

కేసు పూర్వాపరాలు..

1998లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓసీ క్యాటగిరీలో 50, బీసీ 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ మేరకు 221 జీవోను జారీఅయింది. కొన్ని క్యాటగిరీల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలో 45, బీసీలో 40, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులలో 35మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ మళ్లీ జీవో 618 జారీచేశారు.

అదేసమయం లో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఈ జిల్లాల్లో 1998 డీఎస్సీ నియామకాలకు త ర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొదట 221జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కు లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నది. అప్పటి అధికారుల పొరపాటు కారణంగా ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు.

దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. వీరు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా..వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ 2009లో ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు 2011లో ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు అమలుకాకపోవడంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని ఆదేశించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల డీఈవోలు హైకోర్టు తీర్పును అమలుచేయకపోవడంతో అభ్యర్థులు ధిక్కరణ కేసు దాఖలుచేశారు. ఈ కేసులో ఈ నలుగురు డీఈవోలకు ధర్మాస నం రెండునెలల జైలు, జరిమానా విధించింది. చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఈ జైలుశిక్ష అమలుపై నాలుగువారాలపాటు స్టే విధించింది


Additional information
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ప్రతిభావంతుల జాబితాలోని అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ 2009 డిసెంబర్‌ 4న ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల్ని అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులను ఇటీవల సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నవీన్‌రావు విచారించారు.



అనంతరం నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో)లకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే. ఈ శిక్షలపై కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల డీఈవోలు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం ఇటీవల విచారించింది. 4 వారాల్లోగా 1998 డీఎస్సీ అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పటి వరకూ సింగిల్‌ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాల అమలును నిలుపుదల చేసింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "1998 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట"

Post a Comment