త్వరలో ఏకీకృత పాఠశాలలు
గుంటూరు(విద్య), అక్టోబరు 20: ప్రభుత్వం త్వరలో ఏకీకృత పాఠశాలల విధానానికి శ్రీకారం చుట్టనుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ప్రారంభమైన ఏపీ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ప్లాటినం జూబ్లీ వేడుకలు, 19వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందాలన్నదే లక్ష్యంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. విద్యా రంగంలో నూతన సంస్కరణలు చేపట్టే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఫలితంగా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో 12వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారికి జీపీఎఫ్ సమస్య ఉందని, ఈ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు
విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట: మంత్రి సురేశ్
సేవా భావంతో వ్యవహారించాల్సిన విద్యారంగంలో వ్యాపారం మొదలైం దని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి కమిషన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. త్వరలో పాఠశాలల రూపురేఖల్ని మార్చివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుం దన్నారు. దీనిలో భాగంగా ట్రాన్స్‌ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చి ‘ప్రభుత్వ పాఠశాలలు నాడు-నేడు’ అనే నినాదంతో అభివృద్ధ్ది చేయనున్నట్లు తెలిపారు. సభలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వేంకటేశ్వరరావు, జి.హృద యరాజు, ఎమ్మెల్యేలు రజని, బ్రహ్మనాయుడు, నాగార్జున, ముస్తాఫా, ఎమ్మెల్సీలు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు
0 Response to "త్వరలో ఏకీకృత పాఠశాలలు"
Post a Comment