గౌతమ్‌రెడ్డి తప్ప అందరికీ స్థానచలనం ఉపముఖ్యమంత్రులు, మహిళా మంత్రికి నో చాన్స్
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి మంత్రులను రాష్ట్రప్రభుత్వం మార్చింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి (చిత్తూరు ఇన్‌చార్జి మంత్రి)ని తప్ప అందరినీ మార్చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత జూలై 4న జిల్లా ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
నాలుగు నెలల తర్వాత ఇందులో మార్పులు తీసుకొచ్చారు. ఉపముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరితను ఇన్‌చార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు. కొత్తగా విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్, పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావుకు ఇన్‌చార్జి మంత్రులుగా అవకాశం ఇచ్చారు
జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రుల వివరాలు
శ్రీకాకుళం - కొడాలి నాని
విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం - కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ
పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు
ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి
కర్నూలు - అనిల్ కుమార్ యాదవ్
వైఎస్‌ఆర్ కడప - ఆదిమూలపు సురేష్
అనంతపురం - బొత్స సత్యనారాయణ
చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
శ్రీకాకుళం - కొడాలి నాని
విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం - కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ
పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు
ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి
కర్నూలు - అనిల్ కుమార్ యాదవ్
వైఎస్‌ఆర్ కడప - ఆదిమూలపు సురేష్
అనంతపురం - బొత్స సత్యనారాయణ
చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
0 Response to "గౌతమ్‌రెడ్డి తప్ప అందరికీ స్థానచలనం ఉపముఖ్యమంత్రులు, మహిళా మంత్రికి నో చాన్స్"
Post a Comment