ఆచార్య దేవోభవ
ప్రజాశక్తి-చాపాడు.
మాత దేవోభవ - పిత దేవోభవ - ఆచార్యదేవోభవ'' అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. ''గురువు'' అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. ''గు'' అంటే చీకటి. ''రు'' అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ''గు'' అంటే గుహ్యమైనది, తెలియనిది. ''రు'' అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరమూ అక్టోబరు 5 న ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994 అక్టోబరు 5 నుంచి ప్రతి ఏడాదీ నిర్వహిస్తారు. ఈ రోజున ఉపాధ్యాయులందరూ ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ తరాలకు అవసరమైన అంశాలపైచర్చిస్తారు. ఇందుకోసం తమ అందరి మద్దతుతో హామీలను పొందెందుకు సన్నద్ధమవుతారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్నే కొన్ని దేశాలలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించుకుంటారు. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు.
ఉపాధ్యాయులుంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే,. బతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైంది. అనిర్వచనీయమైంది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు ఆయన వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి ...సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం పైనా ఉంది. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది ఆయన బాధ్యత కూడా. గురువు ప్రాధాన్యతను తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.
ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం ఆయన ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ ...ఇలా సంఘంలో ప్రతి వ త్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వ త్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.
ఉపాధ్యాయ వ త్తి సంత ప్తి నిస్తుంది.
ఉపాధ్యాయ వ త్తి చాలా సంత ప్తినిస్తుంది. నిరంతరం విద్యార్థులతో మమేకమై వారి అభ్యున్నతికి క షి చేయడమే ఉపాధ్యాయిని పని. సమాజంలో ఏ విధంగా రాణించాలి అన్నది విద్యార్థికి వివరిస్తూ ముందుకు సాగాలి. గత ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
- కె.ఎం.డి. ఇక్బాల్ ,ఉత్తమ ఉపాధ్యాయుడు, చాపాడు ఉర్దూ హైస్కూల్.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2019 లో ఎంపికైన జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయ వ త్తి అన్నిటికన్నా గౌరవ మైంది. ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం ముఖ్యమైంది ఉత్తమ ఉపాధ్యాయులకు పది సంవత్సరాలుగా సన్మాన కార్యక్రమాన్ని అవార్డీ టీచర్స్ తరపున సన్మానం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా ప్రొద్దుటూరుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
- కెఎల్ వి రమణయ్య, అవార్డు టీచర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. చాపాడు

0 Response to "ఆచార్య దేవోభవ"
Post a Comment