ఆర్టీసీ సమ్మె షురూ

సాక్షి, హైదరాబాద్‌ : కార్మికులు పట్టు వీడలేదు.. ఐఏఎస్‌ అధికారుల కమిటీ మెట్టు దిగలేదు.. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో కార్మికులు సమ్మెకే సై అన్నారు. ముందే ప్రకటించినట్లే శనివారం (5వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. చర్చలు విఫలమైన వెంటనే సమ్మె మొదలైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారి్మకులను సంఘాలు అప్రమత్తం చేశాయి


దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరీ్వసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. 
(చదవండి : ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ కీలక నిర్ణయం)

తుదిదశ చర్చలూ విఫలం 
బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కారి్మక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురుచూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు. 

కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కారి్మక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి ని్రష్కమించింది


డీఎం ఒక్కరే 
సమ్మెల సమయంలో డిపోల్లో మేనేజర్లకు అసిస్టెంట్‌ మేనేజర్లు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సాయంగా ఉంటారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వీరిదే కీలక పాత్ర. కానీ ఈసారి కారి్మకులతోపాటు సూపర్‌వైజరీ కేడర్‌ అధికారుల సంఘం కూడా సమ్మెకు సై అనటంతో వారు అందుబాటులో ఉండరు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు డిపో మొత్తం పర్యవేక్షణకు ఒక్క డిపో మేనేజర్‌ మాత్రమే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఒక్క వ్యక్తి మొత్తాన్ని పర్యవేక్షించే పరిస్థితి లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇబ్బందిగా మారాయి. దీంతో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు రిటైర్డ్‌ ఆర్టీసీ అధికారుల సేవలు పొందేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. శనివారం సాయంత్రానికి వారు కొంతమంది విధుల్లో చేరే అవకాశం ఉంది. 

ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్‌ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్‌ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. 

అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్‌ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు. 

‘ఎస్మా’ఏం చెబుతోంది.. 
ఎస్సెన్షియల్‌ సరీ్వసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ (ఎస్మా) 1971లోని సెక్షన్‌ 3(1) పరిధిలోకి ఆర్టీసీ సమ్మెలు వస్తాయి. దీని ప్రకారం ప్రస్తుతం సమ్మెను నిషేధిస్తూ గత మే 27న ప్రభుత్వం ఉత్తర్వు నెం.9 వెలువరించింది. ప్రస్తుతం అది అమల్లో ఉంది. మోటార్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ ఇండ్రస్టియల్‌ డిస్ప్యూట్స్‌ (ఐడీ) యాక్ట్‌ ప్రకారం చర్చల ప్రొసీడింగ్స్‌ గడువు ముగిసే వరకు సమ్మె చేయటం చట్ట వ్యతిరేకం. ఒకవేళ సమ్మె చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తూ సమ్మె చేసిన కారి్మకులపై చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే క్లాసిఫికేషన్‌ కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌ (సీసీఏ) రెగ్యులేషన్‌ 9(1) ప్రకారం డిస్మిస్‌ చేసే అధికారం ఉంటుంది. 



          CVPRASAD article

అప్పట్లో ఏం జరిగింది.. 
2015మేలో ఆర్టీసీ కారి్మకులు ఇలాగే సమ్మెలోకి వెళ్లారు. వేతన సవరణ గడువు దాటినా కొత్తది ప్రకటించలేదన్న ఆగ్రహంతో మూకుమ్మడి సమ్మెకు దిగారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను హడావుడిగా తీసుకుని బస్సులు అప్పగించింది. దాదాపు 5 వేల బస్సులు తిప్పగలిగారు. ఆరు రోజులపాటు సమ్మె కొనసాగింది. ఏడో రోజు కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవటం, వేతన సవరణకు అంగీకరించటంతో సమ్మె ఆగింది



Additional information

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్ష ముగిసింది. సమ్మె వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో గత రెండ్రోజులుగా జరిపిన చర్చల సారాంశాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీ సీఎంకు వివరించింది. శనివారం నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని, వారు మొండిగా సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది

ఇదే సందర్భంలో ఆర్టీసీలో ఉన్న కార్మికులు, ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి కూడా చేసింది.
రేపు సాయంత్రం 6గంటల్లోగా ఎవరైతే విధుల్లో చేరుతారో వారిని మాత్రమే ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, విధులకు గైర్హాజరైన వారంతా స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, అయినప్పటికీ కార్మికులకు తగిన వేతనాలిచ్చి సంస్థ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే..ఉద్దేశపూర్వకంగా కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లడం సబబు కాదని సీఎం అభిప్రాయపడ్డారు. పండుగ సమయంలో ఆర్టీసీకి కొంత ఆదాయం పెరుగుతుంది. లాభాలు ఆర్జించే అవకాశమున్న సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం భావ్యం కాదని, ఇది సంస్థను నష్టపరచడమేనని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ..కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో అద్దెబస్సులను నడిపేందుకు కూడా శనివారమే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రవాణాశాఖ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు, ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సులు నడపడం, తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులను ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్టీసీ సమ్మె షురూ"

Post a Comment