కీలక పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు అందజేయాలని కేబినెట్‌ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్‌​ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేటినెట్‌ 



నిర్ణయించింది. మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం


Additional information

కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి భూములు రద్దు- కేబినెట్‌ నిర్ణయం
30-10-2019 16:30:03
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి భూములు కేటాయింపును రద్దుచేయాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ నియోజక వర్గాల్లో అగ్రికల్చర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ఎరువులు ల్యాబ్‌లో పరిక్షించిన తర్వాతనే రైతులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెట్టింపు పోషకాహారం అందించే పైలెట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో రూ. 90 కోట్లతో పథకం ఈ పథకం అమలుచేయాలని కూడా కేబినెట్‌లో నిర్ణయం జరిగింది.
 
 
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు ఇవ్వనున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఈమేరకు పథకానికి రూ.6,450 కోట్లు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని అన్నారు. తెల్లరేషన్‌కార్డు , ఆధార్‌ ఉన్నవారికి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి కెనాల్స్‌ వద్ద క్లీనింగ్‌ మిషన్‌ ఏర్పాటు పై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పంట కాలువల్లో మురుగునీరు కలవకుండా శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
 
 
టీటీడీ మినహ దేవాలయాల్లో బోర్డు సభ్యుల నియామకం కోసం చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్సీ కార్పొరేషన్‌ విభజనకు కేబినెట్‌ ఆమోదించింది. మాల, మాదిగ, రెల్లి ఇతర షెడ్యూల్డ్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా రాష్ట్రంలో ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇసుకతోపాటు రోబోసాండ్‌ని కూడా వినియోగించాలని, స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం జరిగిందని మంత్రిపేర్ని నాని వెల్లడించారు.
 
ఇక ప్రజా సేవ చే సే వారికి వైఎస్సార్‌ లైప్‌టైల్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవ్వడంతోపాటు, 10 లక్షల నగదు బహుమతి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. అలాగే హజ్‌, జెరూసలేం యాత్రీకులకు ఆర్ధిక సాయం మరింత పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయం జరిగిందన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి 300 చ.గజాల వరకు రెగ్యులరైజ్‌ చేయాలని, 100 చ.గ.లోపు ఉంటే రూపాయికే రిజిస్ర్టేషన్‌ చేయాలని నిర్ణయం జరిందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to " కీలక పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం"

  1. Nice Information

    A happy marriage is being happy with what you've got, rather than expecting your marriage to be a certain way," says one married woman. Pellichupulu Matrimony is online matchmaking services delivers matchmaking services to users in India and the Indian diaspora through its websites, mobile sites and mobile apps complemented by on-the-ground network centres in India.We are offering 100% mobile verified profiles.Free Registration.For More Details Contact 7097027063 or Visit http://www.pellichupulumatrimony.com/

    ReplyDelete