గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య
సంక్షేమ పథకాలను వెల్లువలాగా ప్రకటిస్తూ, ప్రారంభిస్తూ తనదైన పాలనను ముందుకు తీసుకుపోతున్న ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వేలాది గ్రామీణ పాఠశాలల విద్యార్థుల దశ దిశలను మార్చివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థులకు అర్బన్ టచ్ అని చెబుతున్న ఈ పథకం అమలయితే రాష్ట్రంలోని గ్రామీణ విద్యార్థులు పట్టణ విద్యార్థులతో పోటీ పడే అరుదైన అవకాశాలను దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు.అక్టోబర్ 3వ వారంలో
మొదలు కానున్న ఈ వినూత్న పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 11,378 గ్రామీణ పాఠశాలలను పట్టణ పాఠశాలల విద్యార్థులతో అనుసంధానం చేయనుంది. పట్టణ ప్రాంతాల విద్యార్థులు, టీచర్లు తమ సమీప ప్రాంతాల్లోని గ్రామీణ పాఠశాలలను నెలకు కనీసం నాలుగురోజులపాటు సందర్శించి తమ అనుభవాలను, నైపుణ్యాలను గ్రామీణ విద్యార్థులతో
ఇలా పట్టణ ప్రాంత పాఠశాలల విద్యార్థులు, టీచర్లతో మిళితం కావడం వల్ల గ్రామీణ విద్యార్థులు, వారి టీచర్లు తమ నైపుణ్యాలను, జ్ఞానాన్ని మెరుగుపర్చుకునే వీలుందని ప్రభుత్వ భావన. గ్రామీణ పాఠశాలలతో పోలిస్తే పట్టణ ప్రాంత పాఠశాలలు, విద్యార్థులు మెరుగైన విద్య, టెక్నిక్కులను కలిగి ఉంటున్నారనేది కాదనలేని సత్యం.అందుకే రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా పట్టణ ప్రాంత పాఠశాలల విద్యార్థులను, టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు పంపి వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని తోటి గ్రామీణ విద్యార్థులకు పంచడానికి భారీ పథకం సిద్ధం చేస్తోంది.దీంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పాఠశాల స్థాయిలో ప్రత్యేక స్కూల్ కమిటీలను ప్రభుత్వమే నియమించనుంది. ఈ కార్యక్రమంలో భాగమయ్యే పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించనుంది. సర్వశిక్షా అభియాన్ ఈ పథకాన్ని సమన్వయం చేయనుందని సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వచ్చే రెండేళ్లలోపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనను, సౌకర్యాల మెరుగుదకువ వీలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడనున్నాయి
0 Response to "గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య"
Post a Comment