డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమించిన విషయం తెలిసిందే. వీరిలో డ్రైవర్లకు రూ.1500, కండక్టర్లకు రూ. 1000 రోజువారీ వేతనంగా ఆర్టీసీ ఇస్తోంది. మరికొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రావాణా, పోలీస్‌శాఖలో విశ్రాంత డ్రైవర్ల నుంచి కూడా
దరఖాస్తులు ఆహ్వానించింది. మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్‌ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించింది
0 Response to "డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్"
Post a Comment