హోమ్ లోన్ తీసుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్!
ఇకపోతే కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందిపై ఈ ప్రభావం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తే వారికి ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే.. ట్యాక్స్ రిబేట్ వస్తుంది. దీంతో వారికి రూ.50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదీ కాకుండా మీరు హోమ్ లోన్ రూపంలో ఏడాదిలో రూ.5 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటే మీరు చెల్లించే పన్నులో దాదాపు రూ.50,000 లేదా 10 శాతం ఆదా కలుగుతుంది' అని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. ఇకపోతే కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే వారికి తీసుకున్న లోన్‌పై తొలి మూడు సంవత్సరాలపాటు ట్యాక్స్ రిబేట్ లభించొచ్చు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావం పడే అవకాశముంది. ఇక ఈ కొత్త నిర్ణయం 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు
0 Response to "హోమ్ లోన్ తీసుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్!"
Post a Comment