ఏపీ రైతులకు గుడ్‌న్యూస్
అమరావతి: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయంపై రూ.వెయ్యి పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీన్ని మూడు విడతల్లో అందజేస్తామని కన్నబాబు వివరించారు. వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్ పేరిట పథకాన్ని కొనసాగిస్తామన్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతు ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు.
నాలుగేళ్లకు బదులు ఐదేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని కన్నబాబు స్పష్టంచ చేశారు
ఈ పథకం కింద లక్షల మంది కౌలు రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతులకు మే నెలలో రూ.7,500, రబీ అవసరాలకు రూ.4,000, సంక్రాంతికి రూ.2000 చొప్పున అందజేస్తామని కన్నబాబు వివరించారు. 40 లక్షల మందికి వైఎస్‌ఆర్ రైతుభరోసా అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని కన్నబాబు హితవు పలికారు
0 Response to "ఏపీ రైతులకు గుడ్‌న్యూస్"
Post a Comment