ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు
అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వీటిద్వారా ఇకపై క్రయ, విక్రయదారులే డాక్యుమెంట్ తయారుచేసుకునే అవకాశం కలగనుంది. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లింపు, టైమ్‌స్లాట్ పొందేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది.
ఈ చర్యలతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి 16 రకాల నమూనా డాక్యుమెంట్లను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విశాఖ, కృష్ణా జిల్లాలో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం నవంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లోనూ అమలు చేయనుంది
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిరస్కరించే డాక్యుమెంట్ల అప్పీలుకు అవకాశం కల్పించారు. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 73,74 కింద రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రేపటి నుంచి జిల్లాల్లో నూతన విధానంపై కార్యశాలలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించనున్నట్లు అధికారులు ప్రకటించారు
0 Response to "ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు"
Post a Comment