టీఏ బొనాంజా!

  • కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక
  • డీఏ బాటనే పెంపునకు నిర్ణయం
  • కనీసం రూ.810.. గరిష్ఠంగా 4,320 లబ్ధి



న్యూఢిల్లీ, అక్టోబరు 12: 
కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త. దీపావళి వస్తున్న వేళ వారికి ఇచ్చే రవాణా భత్యాన్ని (టీఏ) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరువు భత్యాన్ని (డీఏ) 5 శాతం పెంచిన కేంద్రం.. ఇప్పుడు టీఏను కూడా పెంచింది. వాస్తవానికి ఈ డీఏ, టీఏ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. దాంతో టీఏ కూడా 5% మేర పెరుగుతుంది. ఆయా ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతా న్ని బట్టి ఈ టీఏను కేంద్రం నిర్ణయిస్తుంది

ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం పెద్ద నగరాల్లో ఉద్యోగులకు నెలకు కనిష్ఠంగా రూ.1350, గరిష్ఠంగా రూ.7200 టీఏ చెల్లిస్తారు. అదే చిన్న పట్టణాల్లో కనిష్ఠంగా 900, గరిష్ఠంగా 3,600 ఇస్తారు. పెంపు నిర్ణయంతో చేతికొచ్చే నెలవారీ మొత్తం కనిష్ఠంగా 810, గరిష్ఠంగా రూ.4,320 మేర పెరుగుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీఏ బొనాంజా!"

Post a Comment