ఆపిల్ అద్దాలు... భలే ఫీచర్లు... అదిరిపోయే ధరలు
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఆధారంగా ఆపిల్ గ్లాసెస్ ను తీసుకొస్తోందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీని మీద ఓ క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆపిల్ ఏఆర్ గ్లాసెస్ ను అంతర్జాతీయ మార్కెట్ లోకి తీసుకొస్తరాట. ప్రస్తుతం ఈ గ్లాసెస్ డిజైనింగ్ జరుగుతోందట. 2017లోనే ఆపిల్ ఈ గ్లాసెస్ కోసం ఏపీఐని సిద్ధం చేసింది. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్)కి టిమ్ కుక్ మంచి పెద్ద ఫ్యాన్ అనే విషయం మీకు తెలిసిందే.ఆపిల్ గ్లాసెస్ ఐఓఎస్ 13తో పని చేస్తుంది. దీనికి స్టార్ బోర్డ్ అనే ప్రాజెక్ట్ నేమ్ పెట్టారు. గార్టా అని కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు. ఈ మేరకు లీక్ అయిన డాక్యుమెంట్ లలో రాసి ఉన్నట్లు అంతర్జాతీయ టెక్ నిపుణులు చెబుతున్నారుప్రముఖ టెక్ అనలిస్ట్ మింగ్ చి కుయో చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఈ ఏడాది ఆఖరి ఆపిల్ గ్లాసెస్ తయారీని ఆపిల్ ప్రారంభించనుందట.ఆపిల్ గ్లాసెస్ లో 2:52 డిగ్రీల హోలో లెన్స్ ఉండొచ్చు. గూగుల్ గ్లాస్ తరహాలో 2డీ ఫ్లోటింగ్ నోటిఫికేషన్లు, మ్యాప్స్ ఫీచర్ ఉంటుంది. వైఫై ఆధారంగా ఐఫోన్ తో దీనిని కనెక్ట్ చేయొచ్చని సమాచారం. గ్లాసెస్ తో చిత్రీకరించిన వీడియోను వెంటవెంటనే మొబైల్ లో చూసుకునే సౌకర్యమూ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. 2కె డిస్ప్లే ఉండొచ్చట. కనీసం 8 గంటలపాటుు వాడుకునేలా బ్యాటరీని అందిస్తారట.చైనాకు చెందిన ఛాంగ్ యింగ్ ప్రెసిసన్ అనే సంస్థ ఆపిల్ గ్లాసెస్ కోసం ఛాసిస్ ను తయారు చేస్తోందట. ఆ సంస్థ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే మార్చి తర్వాత లాంచ్ ఉండొచ్చని సమాచారం. ఇక దీని ధర విషయానికొస్తే 3000 డాలర్ల కంటే తక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ హోలో లెన్స్ 2 కంటే దీని ధర తక్కువ ఉండొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిపుణులు 3000 డాలర్ల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు
0 Response to "ఆపిల్ అద్దాలు... భలే ఫీచర్లు... అదిరిపోయే ధరలు"
Post a Comment