గూగుల్‌ మ్యాప్స్‌లో 57 వేల టాయిలెట్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 2: ఏదైనా నగరానికి/పట్టణానికి వెళినప్పుడు అత్యవసరంగా మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గాబ రా పడకండి!! మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌/గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ ను తెరిచి, ‘టాయిలెట్‌ నియర్‌ మి’ అని టైప్‌ చేయండి. లేదా వాయిస్‌ టైపింగ్‌ ఆప్షన్‌ను వాడుకోండి. ఇలా చేయగానే సమీపంలోని 


మరుగుదొడ్ల్ల(సులభ్‌ కాంప్లెక్సులు) చిరునామాలు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం దేశంలోని 2,300 నగరాలు/పట్టణాల్లో ఉన్న 57వేల పబ్లిక్‌ టాయిలెట్ల సమాచారం తమ సెర్చ్‌ ఇం జన్‌లో నిక్షిప్తమై ఉందని గూగుల్‌ మ్యాప్స్‌ వెల్లడించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌- కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ప్రకటించింది.
 
తొలి ‘టాయిలెట్‌ కాలేజీ’లో 3,200 మంది శిక్షణ పూర్తి

మరుగుదొడ్లు శుభ్రపరచడానికి వాడే ‘హార్పిక్‌’ గురించి మనందరికీ తెలుసు. దాన్ని ఉత్పత్తి చేసే బ్రిటన్‌కు చెందిన ‘రెకిట్‌ బెన్‌కైజర్‌’ కంపెనీ మనదేశంలో తొలి ‘టాయిలెట్‌ కాలేజీ’ని 2018 ఆగస్టులో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఏర్పాటుచేసింది. నాటి నుంచి నేటి వరకు 3,200 మంది పారిశుధ్య కార్మికులకు సురక్షిత విధి నిర్వహణ విధానాలపై శిక్షణ అం దించినట్లు తెలిపింది. వారందరికీ ఆకర్షణీయమైన వేతనంతో కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ మ్యాప్స్‌లో 57 వేల టాయిలెట్లు"

Post a Comment