1 నుంచి కంటివెలుగు రెండో దశ: సీఎస్
అమరావతి(ఆంధ్రజ్యోతి): అంధత్వ నివారణకు చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకం సత్ఫలితాలిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం సచివాలయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేసి కళ్లజోళ్లు అందించామన్నారు. మొదటి దశలో 60,693 ప్రభుత్వ, ప్రైవేటు
పాఠశాలల్లోని 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని వైద్యశాఖ అధికారులు సీఎ్‌సకు తెలిపారు. రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని నవంబరు 1 నుంచి నిర్వహిస్తామన్నారు
0 Response to "1 నుంచి కంటివెలుగు రెండో దశ: సీఎస్"
Post a Comment