- జాతీయ స్థాయిలో 3 విభాగాల్లో అందజేత
- ప్రదానం చేసిన కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏపీలోని 13 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డులను అందించింది. దేశవ్యాప్తంగా మొత్తం 250 పంచాయతీలకు ఈ అవార్డులు దక్కగా, వీటిలో రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయు. పొరుగు రాష్ట్రం తెలంగాణ తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ పథకాలకు గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు కేంద్రం అమలుచేసే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న పంచాయతీలకు ఈ అవార్డులను అందించారు. గ్రామసభలను ఉత్తమంగా నిర్వహించిన వాటికి ‘నానాజీ దేశ్‌ముఖ్ రాష్ర్టీయ గ్రామ సేవా గౌరవ పురస్కార్’ను, సామాజిక అభివృద్ధి పారిశుధ్య రంగంలో చేసిన సేవకు ‘దీనదయాళ్ ఉపాధ్యాయ స్వశక్తీకరణ పురస్కార్’, పిల్లల సంరక్షణకు సంబంధించి ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పేరుతో మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను కేటాయించారు. వీటిని ఢిల్లీలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆయా రాష్ట్రాలకు బుధవారం ప్రదానం
చిత్తూరుజిల్లా పంచాయతీ కార్యాలయానికి జనరల్ కేటగిరీలో వచ్చిన అవార్డును ఆ జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా అందుకున్నారు. జనరల్ కేటగిరీలో అనంతపురంజిల్లా గుమ్మగట్ట, చిత్తూరుజిల్లా వేదురుకుప్పం, విశాఖపట్నంజిల్లా సబ్బవరం, కర్నూలు జిల్లా కర్నూలుకు అవార్డులు దక్కాయి. పారిశుధ్య విభాగంలో శ్రీకాకుళంజిల్లా, రాజాం మండలం, పొగిరి, గార గ్రామపంచాయతీలు, పశ్చిమగోదావరిజిల్లా, బుట్టాయగూడెం, కడపజిల్లా, రాజంపేట మండలం, కూచివారిపల్లి పంచాయతీ, తూర్పుగోదావరిజిల్లా, సామర్లకోట మండలం, అచ్చంపేట, నెల్లూరు జిల్లా, పెళ్లకూరు మండలం, తల్వాయిపాడు, ప్రకాశంజిల్లా, మార్టూరు మండలం కోణంకి గ్రామపంచాయతీలకు అవార్డులు లభించాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ అవార్డులను అందుకున్నారు.
0 Response to "13 గ్రామ పంచాయతీలకు అవార్డులు"
Post a Comment