NASA Video : భారీ నక్షత్రాన్ని మింగేసిన బ్లాక్ హోల్

ఆ నక్షత్రం తన దారిన అది ఉంది. దానిపై కన్నేసిన బ్లాక్ హోల్... క్రమంగా దాన్ని తనవైపు లాగేసుకుంది. అంతే... గుండ్రంగా ఉండే నక్షత్రం కాస్తా... జీడిపాకంలా సాగిపోయింది. ఆ దృశ్యాల్ని నాసాకి చెందిన... ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS)కి ఉన్న ప్లానెట్ హంటింగ్ టెలిస్కోప్ షూట్ చేసింది. ఇలాంటి దృశ్యాలు టెలిస్కోప్‌కి చిక్కడం ఇదే తొలిసారి. మన భూమికి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో బ్లాక్ హోల్‌ వల్ల 375 నక్షత్రం ఎలా నాశనమైపోయిందో... ఈ దృశ్యాల్లో తెలుస్తోంది. అది మామూలు బ్లాక్‌హోల్ కాదనీ, సూపర్ మాసివ్ (అత్యంత శక్తిమంతమైన) బ్లాక్‌హోల్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అది చిన్న నక్షత్రం కాదు... మన సూర్యుడంత పెద్దది



అంత భారీ నక్షత్రాన్ని... బలవంతంగా లాగేసుకుంది బ్లాక్ హోల్. అంతరిక్షంలో ఇదో అరుదైన ఘటన. దీన్నే టైడల్ డిస్రప్షన్ ఈవెంట్ (tidal disruption event) అని వ్యోమగాములు పిలుస్తున్నారు

నిజానికి TESS టెలిస్కోప్ వేరే పనిలో ఉంది. సూదూరాల్లో ఉన్న గ్రహాల్ని పరిశీలించే పనిలో పడింది. ఐతే... కొందరు శాస్త్రవేత్తలకు ఈ నక్షత్రం నాశనం కాబోతోందన్న విషయం ముందే అర్థమైంది. వెంటనే ఆ దృశ్యాల్ని షూట్ చేసేందుకు... టెస్ టెలిస్కోప్‌ను అటువైపు తిప్పారు.అంతరిక్షంలో భారీ నక్షత్రం పేలినపోయిన తర్వాత... బ్లాక్‌ హోల్ అనేది ఏర్పడుతుంది. అప్పటి నుంచీ అది శక్తిమంతమైన పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటుంది. చివరకు కాంతిని కూడా అది లోపలికి లాగేసుకుంటుంది. ఇక్కడా అదే జరిగింది. మన పాలపుంతలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "NASA Video : భారీ నక్షత్రాన్ని మింగేసిన బ్లాక్ హోల్"

Post a Comment