మరో దఫా రేటు కోత?
4న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
విశ్లేషకుల అభిప్రాయం
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం (0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4 శాతం దిగువన నిర్దేశిత లక్ష్యాల లోపు కొనసాగుతుండడం రెపో రేటు కోతకు కలిసి వస్తున్న అంశం.
ఈ నేపథ్యంలోనే మరో దఫా రేటు కోతకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు అవకాశం లేదుకానీ, రెపో రేటు తగ్గింపునకు కొంత వీలుందని ఇటీవలే స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొనడం గమనార్హం. కార్పొరేట్ పన్ను కోతసహా ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. దీనితోపాటు దేశంలో పండుగల వాతావరణం ఉంది.
ఆయా పరిస్థితుల్లో డిమాండ్ పెంపునకు 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయం వెలువడుతుందన్నది పలువురి విశ్లేషణ. కాగా బ్యాంకులు తమకు అందివచ్చిన రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టడానికి ఇప్పటికే ఆర్‌బీఐ కీలక చర్య తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచీ బ్యాంకులు తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, తదితర ఎక్స్‌టర్నల్ రేట్లకు బదలాయించాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఆదేశించింది
Additional information
ముంబయి: ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను శుక్రవారం మరోమారు తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే వరుసగా ఐదోసారి వడ్డీరేట్లను తగ్గించినట్లవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యాపార అనుకూల వాతావరణం నెలకొల్పడానికి కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో నగదు ప్రవాహం పెంచి పారిశ్రామిక కార్యకలాపాల్లో జోష్ నింపేందుకు చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష కమిటీకి గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షత వహిస్తున్నారు. అక్టోబర్4న నాలుగో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించనున్నారు.
గత జనవరి నుంచి ఆర్‌బీఐ వరుసగా నాలుగు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది
గత జనవరి నుంచి ఆర్‌బీఐ వరుసగా నాలుగు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది
మొత్తం 1.10పాయింట్లు తగ్గించింది. చివరిసారి ఆగస్టులో 35బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సారి ఆర్‌బీఐ నిర్ణయాలు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రుణాలను బెంచిమార్క్ రేట్లకు అనుసంధానించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇటీవల ఒక సందర్భంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వానికి తక్కువ అవకాశం ఉండటంతో ఆర్‌బీఐ ద్వారా ఎక్కువ ఉపశమనాలు కల్పించాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీంతో వడ్డీరేట్లపై మరింత కోత ఉంటుందని భావిస్తున్నారు
0 Response to "మరో దఫా రేటు కోత?"
Post a Comment