వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త జరిమానాలు ఇవే!
కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. అంతేకాకుండా ఈ భారీ ఫైన్లపై సమగ్ర అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారులను జగన్ ఆదేశించారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రవాణ అధికారుల కమిటీ సూచించిన జరిమానాలు:
రోడ్డు నిబంధన అతిక్రమిస్తే - రూ.250 (కేంద్రం రూ.500)
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే - రూ.2500 (కేంద్రం రూ.5000)
అర్హత లేకుండా వాహనం నడిపితే - రూ.4000 (కేంద్రం రూ.10,000)
ఓవర్ సైజ్డ్ వాహనాలు - రూ.1000 (కేంద్రం రూ.5000)
డేంజరస్ డ్రైవింగ్ - రూ.2500 (కేంద్రం రూ.5000)
డ్రంక్ అండ్ డ్రైవ్ - రూ.5000 (కేంద్రం రూ.10,000)
సీట్ బెల్ట్ - రూ.500 (కేంద్రం రూ.1000)
ఇన్సూరెన్స్ లేకుంటే - రూ.1250 (కేంద్రం రూ.2000)
0 Response to "వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త జరిమానాలు ఇవే!"
Post a Comment