బంగ్లాదేశ్‌ అడుగున సముద్రం!

  • హెచ్‌సీయూ అధ్యాపకులు, ఎన్‌ఐవో శాస్త్రవేత్తల పరిశోధన

హైదరాబాద్‌, సెప్టెంబరు 23: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యాపకులు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫీ(ఎన్‌ఐవో) శాస్త్రవేత్తలు కలిసి అత్యంత పురాతనమైన సముద్రపు అడుగు భాగాన్ని బంగ్లాదేశ్‌లో కనుగొన్నారు. ఈ విషయాన్ని కరెంట్‌ సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. వర్సిటీ నుంచి గురువారం ప్రకటన కూడా విడుదల చేశారు. ఇంతవరకు దీవుల్లోనే ఇలాంటి భూభాగాన్ని గుర్తించారని, మొట్టమొదటిసారిగా ఒక ఖండానికి అంచున ఉన్న దేశంలో ఇలాంటి ప్రాంతాన్ని గుర్తించామని తెలిపారు. కోల్‌కతా నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌ వరకు సముద్రపు రాళ్లు భూమిలో కప్పబడి ఉన్నాయని, ఇవి అంతకు మందు బంగాళాఖాతంలో భాగమనేనని తెలిపారు



గంగా, బ్రహ్మపుత్ర నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో సముద్రపు రాళ్లు మట్టిలో కూరుకుపోయాయని చెప్పారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగంగా మారిందని చెప్పారు. ఖండచలన ప్రక్రియలో బంగ్లాదేశ్‌లో చాలా భాగం సముద్రం నుంచే ఏర్పడిందని తాము తెలుసుకొన్నట్లు వివరించారు. భూపటలంలో మార్పులపై ఎన్నో ఏళ్ల పరిశోధన తర్వాతే ఈ ఆవిష్కరణ సాధ్యమైందని చెప్పారు. తాజా పరిశోధనలతో ఖండచలన సిద్ధాంతాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బంగ్లాదేశ్‌ అడుగున సముద్రం!"

Post a Comment