వడ్డీ రేట్లల్లో మరింత తగ్గింపు?
ఆర్బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) పాలసీ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ అంచనాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ రేటు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో సెంట్రల్ బ్యాంక్ రేట్లను మరింత తగ్గించవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తక్కువ, పారిశ్రామిక ఉత్పత్తి మందగించడం వల్ల సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశముందని దేశీయ, ప్రపంచ బ్రోకరేజ్ సంస్థల పేర్కొంటున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 3.21 శాతంగా ఉంది. జూలైలో ఇది 3.15 శాతంగా ఉంది. ఆహార ధరలు ఖరీదైనవి కావడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. అదేవిధంగా జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు (ఐఐపి) 4.3 శాతంగా ఉంది. ఉత్పాదక రంగం పనితీరు సరిగా లేకపోవడంతో ఐఐపి మందగించింది
ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను మరింత తగ్గించాల్సి ఉంటుంది. అక్టోబర్ 4 ద్రవ్య సమీక్ష వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించడానికి అవకాశం కల్పిస్తుందని బిఒఎఫ్ఎమ్ఎల్ నివేదిక పేర్కొంది. ఆగస్టులో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. అందువల్ల పాలసీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గిస్తుందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. అక్టోబర్లో ఇది 0.40 శాతం తగ్గుతుందని అంచనా వేసింది
ద్రవ్యోల్బణం స్తబ్దుగా ఉండటం, పారిశ్రామిక వృద్ధి మందగించడం వల్ల అక్టోబర్ ద్రవ్య సమీక్షలో పాలసీ రేటు మరింత తగ్గొచ్చని జపాన్ ఆర్థిక సేవల రంగ సంస్థ నోమురా అంచనా వేసింది. నాలుగో త్రైమాసికంలో మొత్తం పాలసీ రేట్లు 0.40 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ 6.9 శాతం వృద్ధి రేటు అంచనా వేయడం కొంత ఆశాజనకంగా ఉందని నోమురా తెలిపింది.ఈ అంచనాను అక్టోబర్ 4 ద్రవ్య సమీక్షలో తగ్గించవచ్చు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ (బిఒఎఫ్ఎమ్ఎల్) ప్రకారం, పెట్టుబడిని ప్రోత్సహించడానికి వాస్తవ వడ్డీ రేట్లను తగ్గించడం అవసరం.
ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను మరింత తగ్గించాల్సి ఉంటుంది. అక్టోబర్ 4 ద్రవ్య సమీక్ష వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించడానికి అవకాశం కల్పిస్తుందని బిఒఎఫ్ఎమ్ఎల్ నివేదిక పేర్కొంది. ఆగస్టులో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. అందువల్ల పాలసీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గిస్తుందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. అక్టోబర్లో ఇది 0.40 శాతం తగ్గుతుందని అంచనా వేసింది
0 Response to "వడ్డీ రేట్లల్లో మరింత తగ్గింపు?"
Post a Comment