డిపాజిట్లపై ఛార్జీలు..! ఎప్పటి నుంచి అమలు అంటే..?

ఎప్పుడు పడితే అప్పుడు..! ఎన్నిసార్లు కుదితే అన్నిసార్లు..! బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు చేస్తే.. వడ్డింపు తప్పదు. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాకింగ్ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. బ్యాంక్‌ సేవలు, లావాదేవీల ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. క్యాష్‌ డిపాజిట్లు, విత్‌డ్రాస్, ఏటీఎం సేవలు, చెక్‌ వినియోగంపై విధించే ఛార్జీల్లో మార్పులు చేసింది ఎస్‌బీఐ. సవరణల ప్రకారం.. ఇకపై వినియోగదారులు ఒక నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా.. తమ ఖాతాల్లో డబ్బును జమ చేసే అవశం ఉంటుంది.. ఇక, ఆ తర్వాత చేసే క్యాష్ డిపాజిట్లకు చార్జీలను విధించనున్నారు.

మూడు డిపాజిట్లు ఫ్రీ కాగా.. ఆ తర్వాత చేసే డిపాజిట్లకు ప్రతి లావాదేవీకి రూ.50 ఛార్జీ చేస్తారు





మరోవైపు చెక్‌ బౌన్స్‌ అయితే రూ.150 ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనంగా వసూలు చేయనుంది ఎస్బీఐ. ఇక, మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఇకపై ఉచితంగా 10 లావాదేవీలను ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంల్లో చేసుకునే అవకాశం ఉండగా.. మెట్రో నగరాలు మినహాయించి ఇతర నగరాల్లో అయితే వాటి సంఖ్య 12గా నిర్ణయించింది.

ఇక, ఎస్బీఐయేతర బ్యాంక్‌ ఏటీఎంల్లో నెలకు ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది ఎస్‌బీఐ. మరోవైపు సాలరీ అకౌంట్స్ ఉన్నవారికి ఏటీఎం సేవలను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తోంది. ఆర్‌టీజీఎస్‌ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లావాదేవీలు చేస్తే.. రూ.20, రూ.5 లక్షలకు పైబడిన మొత్తాలకు రూ.40 చార్జీలను విధించనుంది ఎస్బీఐ. సవరించిన ఛార్జీలను అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిపాజిట్లపై ఛార్జీలు..! ఎప్పటి నుంచి అమలు అంటే..?"

Post a Comment