విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
పదోతరగతి ప్రశ్నాపత్రంలో ఇక కీలక మార్పులు
ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగింపు
ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగానే బిట్ పేపర్
పేపర్–1లో 50.. పేపర్–2లో 50 మార్కులు
సమాధాన పత్రంగా 18 పేజీల బుక్‌లెట్
విద్యార్థుల విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రం
సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగిస్తామని వెల్లడించారు. ఇకపై బిట్ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి
సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం. ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్‌లలో వచ్చిన మార్కులను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం. సమాధాన పత్రాలు గతంలో లూజ్ షీట్లు ఉండేవి. దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది. అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నాం. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం. కంప్యూటర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం. దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’’ అని మంత్రి సురేష్ అన్నారు.
పేరెంట్స్ కమిటీల పర్యవేక్షణలోనే కార్యక్రమాల అమలు
రాష్ట్రంలో 46,635 పాఠశాలలకు తల్లిదండ్రుల (పేరెంట్స్) కమిటీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు 45,390 స్కూళ్లకు కమిటీల ఎంపిక పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టంపై పేరెంట్స్ కమిటీలకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలల పర్యవేక్షణ, నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తామని అన్నారు. ఎన్నిక వాయిదా పడిన స్కూళ్లలో 28వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ మాసాంతంలో పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, సైకిళ్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
కొత్త ప్రశ్నాపత్రం ఇలా..
►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.
►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.
►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►1 మార్కు చొప్పున 8 మార్కులు.
►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►2 మార్కులు చొప్పున 16 మార్కులు.
►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.
►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు
Additional information
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప్రశ్నపత్రం స్వరూపం మారింది. ప్రశ్నపత్రం-బిట్ పేపర్ వేర్వేరుగా ఉండవు. బిట్ పేపర్ కూడా ప్రశ్నపత్రంలోనే అనుసంధానం అవుతుంది. ఇంటర్నల్ మార్కులు రద్దవుతాయి. పరీక్ష కాల వ్యవధి కూడా మారింది. ఇప్పటి వరకూ 2:30 గంటలు ఉండగా... ఇప్పుడు మరో 15 నిమిషాలు అదనంగా ఉంటుంది. పరీక్ష రాసేందుకు 2:30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 10 నిమిషాలు, రాసిన జవాబులను తనిఖీ చేసుకోవడానికి 5 నిమిషాలు... అంటే మొత్తం మీద పరీక్ష కాలవ్యవధి 2:45 గంటలు ఉంటుంది. పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు విభాగాలుగా రూపొందించారు. ఇందులో 5 వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి. 8 లఘు సమాధాన ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. 8 సూక్ష్మ లఘు సమాధాన ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 8 మార్కులు ఉంటాయి.
12 అతి సూక్ష్మ లఘు సమాధాన ప్రశ్నలకు అర మార్కు చొప్పున 6 మార్కులు ఉంటాయి. బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ఇందులోనే బిట్లు కలిసే ఉంటాయి. జవాబుపత్రాలను విడివిడిగా కాకుండా ఒకేసారి 18 పేజీలతో కూడిన బుక్‌లెట్‌తో అందిస్తారు. దీనికి సంబంధించి అవగాహన కోసం ప్రశ్నపత్రాలను, పరీక్షా విధానాలను అందరికీ తెలియజేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం సచివాలయంలో మీడియాతో ఈ విషయం తెలిపారు. మూల్యాంకనాన్ని సమగ్రంగా చేపట్టడానికి ఒక కంప్యూటర్ సంస్థను ఎంపిక చేస్తామని, ఇందుకోసం ఐటీ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, విద్యాశాఖ కమిషనర్‌తో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్కుల జాబితా ఒకవేళ తడిచినా చిరిగిపోయే ప్రమాదం లేకుండా నాణ్యమైన పేపర్‌ను వినియోగించి ముద్రిస్తామని తెలిపారు.
20శాతం ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి చేకూరుతుందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. బిట్ పేపర్‌ను ప్రత్యేకంగా ఇవ్వడం వల్ల మాస్ కాపీయింగ్, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ అనే విమర్శలు వచ్చాయన్నారు. అందుకే పదో తరగతి పరీక్షల్లో ఈ కీలక మార్పులు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. ప్రతి సబ్జెక్టులో 50 మార్కులకు పేపర్-1, 50 మార్కులకు పేపర్-2 ఉంటుందన్నారు. ఒక్కో సబ్జెక్టులో రెండు పేపర్‌లను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.
విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నపత్రాలను రూపొందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 46,635 పాఠశాలలకు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరిగాయని, వాయిదా పడిన చోట 28లోగా పూర్తి చేస్తామని చెప్పారు. అక్టోబరులో ఈ కమిటీలకు శిక్షణ, ముందుగా ఎస్‌ఎ్‌సఏ సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పెద్దఎత్తున చేపడతామన్నారు. మన బడి-మన బాధ్యత, నాడు-నేడు ట్యాగ్‌లైన్‌తో ముందుకెళ్తున్నట్లు చెప్పారు
సాక్షి, అమరావతి : పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను రద్దు చేసింది. గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం. పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను తొలగించాము. గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు రద్దు చేశాం. బిట్ పేపర్‌ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసాం. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తాం.
2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నాం.
మార్కుల షీట్‌ని కూడా నాణ్యంగా తయారుచేస్తాం. పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తాం. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించాం. 45,390 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి చేశాం. పాఠశాలల్లో విద్యాశాఖ అమలుచేసే పథకాలపై కమిటీలకు అవగాహన కల్పిస్తాం. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేస్తాం. మన బడి.. మన బాధ్యత పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపడతా''మన్నారు
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులతో పాటు బిట్ పేపర్ రద్దు చేసింది. ఇకపై క్వశ్చన్ పేపర్ లోనే భాగంగా బిట్ పేపర్ ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ సంస్కరణలు తీసుకొచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులకు అదనంగా 15 నిమిషాల వ్యవధి ఇస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పు అమలు చేస్తామన్నారు.
ఇంటర్నల్ అసైన్ మెంట్ మార్కులు కార్పొరేట్ స్కూళ్లకు వరంగా మారాయని మంత్రి ఆరోపించారు. 45వేల 390 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటయ్యాయని, కమిటీ సభ్యులకు త్వరలో ట్రైనింగ్ ఇస్తామని మంత్రి తెలిపారు.
0 Response to "టెన్త్ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం"
Post a Comment