ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.47 ఏళ్ల నిబంధనలో మార్పు!
ఇలా పదేళ్ల వరకు ఈ సౌకర్యం ఉంటుంది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్ 1972ను సవరించడంవల్ల కేంద్ర ప్రభుత్వపు ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరనుంది.ఈ రూల్ సవరణ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది..సవరణ కారణంగా సెంట్రల్ అర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సహా పలువురు ఉద్యోగుల కుటుంబాలకు ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగనుంది.ఇంతే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపులు కూడా చేసింది.దీంతో వ్యాపారులు,ఇన్వెస్టర్లు,ఎస్ఎంఈ లకు ఊరట కల్పించింది.బడ్జెట్‌లో పెంచిన సర్‌చార్జీని తగ్గించడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు శుభవార్త అందించింది.
ఫ్లోటింగ్ రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంతో బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది.ఇలా మోదీ సర్కార్ దేశంలో ఇన్వెస్ట్‌మెంట్లకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసింది.అంతే కాకుండా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్‌లోని ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలుగుతుంది.డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కమిటీ ఇప్పటికే తన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది.ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది.ఈ ప్రతిపాదనలు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి.ఇక మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు మేలు కలుగుతుంది
0 Response to "ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.47 ఏళ్ల నిబంధనలో మార్పు!"
Post a Comment