టెక్ రివ్యూ : నెంబర్ సేవ్ చేసుకోకుండా.. వాట్సాప్ మెసేజ్ ఇలా పంపాలి
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. యూజర్లను ఆకట్టకునేందుకు ఆకర్షణీయ అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. సాధారణంగా వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందుగా వారి మొబైల్ నెంబర్ కాంటాక్టు లిస్టులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే మరొకరికి ఫొటోలు లేదా వీడియోలు, మెసేజ్ లు పంపే వీలుంది. మరో విషయం గుర్తించుకోండి.. మీరు పంపే మొబైల్ నెంబర్ కు వాట్సాప్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.
అప్పుడు మాత్రమే మీరు పంపే మెసేజ్ వారి వాట్సాప్ అకౌంట్ కు వెళ్తుంది. కానీ, ఫోన్ నెంబర్ యాడ్ చేయకుండా ఎలా మెసేజ్ పంపాలో తెలుసా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. ఓసారి ప్రయత్నించి చూడండి
ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి :
* మీ వాట్సాప్ కాంటాక్టు లిస్టులో ఇతరుల మొబైల్ నెంబర్ సేవ్ చేయలేదా?
* అయినప్పటికీ ఇతరులకు ఈజీగా మెసేజ్ పంపవచ్చు.
* అదేలా అంటారా? ఇదోగో ఈ టిప్ ఫాలో అవ్వండి చాలు..
* ముందుగా మీరు మీ Smartphone లోని Web Browser ఓపెన్ చేయండి..
*ఈ లింక్ https://api.WhatsApp.com/send?phone=number కాపీ చేసి Pasteచేయండి.
* number స్థానంలో ఎవరికి మెసేజ్ పంపాలో వారి 10 అంకెల గల ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* ఆ ఫోన్ నెంబర్ ముందు +sign (+91) కంట్రీ కోడ్ తొలగించండి.
* ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఎంటర్ చేస్తే.. కంట్రీ కోడ్ (జీరోలు, బ్రాకెట్లు, డ్యాష్ (0,-) తొలగించండి.
* మీరు పంపే మొబైల్ నెంబర్ కు..WhatsApp అకౌంట్ ఉండి ఉండాలి.
* Message బటన్ పై క్లిక్ చేసి.. Chatమెసేజ్ పంపండి.
* మీకు కొత్త Text Box ఓపెన్ అవుతుంది. మెసేజ్ టైప్ చేసి పంపండి.
* ఫొటోలు లేదా వీడియోలు, ఎమోజీలు ఏమైనా పంపుకోవచ్చు.
మరో Method :
* https://wa.me/phonenumber లింక్ మొబైల్ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి.
* phonenumber స్థానంలో ఎవరికి మెసేజ్ పంపుతున్నారో వారి ఫోన్ నెంబర్ టైప్ చేయండి.
* కంట్రీ లేదా రీజియన్ కోడ్ (+sign) లేకుండా కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి.
* ఉదాహరణకు.. +912222222222 నెంబర్ ఉంటే.. ముందు + తొలగించాలి.
* ఇప్పుడు కేవలం 10 అంకెల ఫోన్ నెంబర్ మాత్రమే 2222222222 కనిపిస్తుంది
0 Response to "టెక్ రివ్యూ : నెంబర్ సేవ్ చేసుకోకుండా.. వాట్సాప్ మెసేజ్ ఇలా పంపాలి"
Post a Comment