ఆ నిర్ణయం ప్రమాదకరం..ఇస్రోకు సూచన
న్యూఢిల్లీ: 'విక్రమ్'తో కమ్మూనికేషన్
పునరుద్దరించేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో
ఆర్బిటర్ కక్ష్యను తగ్గించే యోచనలో ఇస్రో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్బిటర్‌ను చంద్రుడి ఉపరితలానికి 50 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో ప్రయత్నింస్తోందనేది ఈ వార్తల సారాంశం.
ఈ చర్య ద్వారా విక్రమ్ నుంచి వచ్చే సిగ్నళ్లను మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చనేది ఇస్రో అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈ వార్తలపై పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు స్పందించారు. ఈ నిర్ణయం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
'ఇస్రో ఆలోచన చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. విక్రమ్ ల్యాండర్‌ను మనం శాశ్వతంగా కోల్పోయాం. ఇక మిగిలింది ఆర్బిటర్ మాత్రమే. ఆర్బిటర్ కక్ష్యను తగ్గిస్తే.. దాని జీవితకాలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చంద్రుడికి 50 కిమీల దూరంలో ఉన్న కక్ష్యలోనే ఆర్బిటర్‌ను నిలిపి ఉంచేందుకు దాని ఇంజన్లను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఇంధనం ఖర్చైపోయి..ఆర్బిటర్ జీవితకాలం తగ్గిపోతుంది.' అని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు
0 Response to "ఆ నిర్ణయం ప్రమాదకరం..ఇస్రోకు సూచన"
Post a Comment