5రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి చేతులమీదుగా 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఆదివారం సంచలన ప్రకటన విడుదల చేసింది కేంద్రం. తెలంగాణ గవర్నర్‌గా పని చేస్తున్న నరసింహన్ స్థానంలో సౌందర రాజన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణతో పాటు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు కూడా గవర్నర్లు మారారు.
* కేరళ గవర్నర్‌గా ఆరెఫ్ మహ్మద్ ఖాన్
* హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ
* రాజస్థాన్ గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా
* తెలంగాణ గవర్నర్‌గా సౌందర రాజన్
* మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోషియారి
> గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు సౌందర రాజన్
కొన్ని సంవత్సరాలుగా అధికార పదవికి దూరంగా ఉన్న దత్తాత్రేయకు హిమాచల్ ప్రదేశ్ పగ్గాలు అప్పజెప్పింది కేంద్రం.
> 2014లో కల్‌రాజ్ మిశ్రా మోడీ ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంత్రిగా కూడా పనిచేశారు. ఆచార్య దేవరాత్ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన మిశ్రా 2019లో రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు.
> రాజస్థాన్‌కు 4 సెప్టెంబర్ 2014నుంచి గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్ సింగ్ స్థానంలో కల్‌రాజ్ మిశ్రాను నియమించింది బీజేపీ ప్రభుత్వం.
> మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ స్థానంలో 22వ గవర్నర్‌గా భగత్ సింగ్ కోషియారి నియమితులయ్యారు
0 Response to "5రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించిన రాష్ట్రపతి"
Post a Comment