నేటి ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని భావించిన ప్రభుత్వం పీపీఏ రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ట్రిబ్యునల్ రెండు రోజుల క్రితం రద్దు చెయవద్దని ఆదేశించింది. ఈ అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కూడా గురువారం చర్చ జరగనుంది. అదే విధంగా అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో వీటిపైనా చర్చించనున్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి మంత్రులు చర్చించనున్నారు.
వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 15వ పీఆర్సీపై చర్చ జరగనుంది. వీటన్నిటితో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాల అమలు కోసం కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం జగన్ గురువారం స్పష్టత ఇవ్వనున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఇసుక విధానంపై మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 100 రీచ్‌లను గుర్తించామని, 5వ తేదీ నుంచి స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు
0 Response to "నేటి ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ"
Post a Comment