ప్రాణం కాపాడే ‘గ్రాస్ప్‌మాన్‌

ప్రాణం కాపాడే ‘గ్రాస్ప్‌మాన్‌
బెంగళూరు, ఆగస్టు 14: భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న బాధితుల ప్రాణాలు కాపాడే రోబోను ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అద్భుత గ్రహణశక్తి, గమనశక్తి, మనిషి తరహాలో చేతిని ఉపయోగించే నేర్పు వంటి బహుముఖ ప్రజ్ఞలు కలిగి ఉన్న దీనికి ‘గ్రాస్ప్‌మాన్‌’ అని పేరు పెట్టారు.




 వస్తువులను సులువుగా పట్టుకోవడానికి వీలుగా ఈ రోబోకు రెండు చేతుల వంటి యంత్ర పరికరాలు అమర్చారు. పారిశ్రామిక రంగంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్వహించే సహాయక చర్యల్లో దీని సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఈ బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ అశోకన్‌ తొండియత్‌ వివరించారు. వివిధ పరిమాణాల్లో ఉన్న వస్తువులను పట్టుకొని, నడిచే సామర్థ్యం, బబూన్ల తరహాలో చేతులు ఊపడం వంటి లక్షణాలు దీని ప్రత్యేకత

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రాణం కాపాడే ‘గ్రాస్ప్‌మాన్‌"

Post a Comment