ఏటీఎం లావాదేవీలు..ఆర్‌బీఐ వివరణ
*✨ ఏటీఎం లావాదేవీలు..ఆర్‌బీఐ వివరణ*
★ బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఊరట.
★ ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం కోటాలో విఫలమైన లావాదేవీలను లెక్కించవద్దని ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశం.
★ సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటున్నాయనే ఫిర్యాదులతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం.
★ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ.
★ కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ వసూలు చేయరాదని ఆర్‌బీఐ ప్రకటన.
★ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు,
★ రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు,
★ చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
🌿🌼🌸🌸🌼🌿
0 Response to " ఏటీఎం లావాదేవీలు..ఆర్‌బీఐ వివరణ"
Post a Comment