అవార్డుల జాబితా



పారా అథ్లెట్‌, రెజ్లింగ్‌ స్టార్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం 


సాయిప్రణీత్‌, జడేజా సహా 19 మందికి అర్జున


న్యూఢిల్లీ: స్టార్‌ పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయింది. ఈమేరకు అవార్డుల ఎంపిక కమిటీ ఆమె పేరును సిఫారసు చేసింది. ప్రముఖ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాను ఖేల్‌రత్నకు నామినేట్‌ చేస్తూ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ అధ్వర్యంలోని 12 మంది సభ్యుల కమిటీ శనివారం రెండోరోజు సమావేశమై ఖేల్‌రత్నతోపాటు మిగిలిన పురస్కారాలకూ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

క్రికెటర్‌ రవీంద్ర జడేజా, తెలుగు షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ సహా 19మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. 2016 పారా ఒలింపిక్స్‌ షాట్‌పుట్‌ ఎఫ్‌53 విభాగంలో 48 ఏళ్ల దీపా మాలిక్‌ రజత పతకం గెలుపొందింది. ఈనేపథ్యంలో పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో దీప పద్మశ్రీ, అర్జున అవార్డులను అందుకుంది. 156 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జడేజా..2128 పరుగులు చేయడంతోపాటు 178 వికెట్లు పడగొట్టాడు. 42 టీ20ల్లో 135 రన్స్‌, 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 41 టెస్ట్‌ల్లో 1485 పరుగులు చేయడంతోపాటు 192 వికెట్లు పడగొట్టాడు. బ్యాడ్మింటన్‌ మాజీ స్టార్‌ విమల్‌కుమార్‌ సహా ముగ్గురిని ద్రోణాచార్య అవార్డుకు, మరో ముగ్గురిని ద్రోణాచార్య జీవిత సాఫల్య కేటగిరీకి ఎంపిక కమిటీ సిఫారసు చేసింది.

అవార్డుల జాబితా

రాజీవ్‌ఖేల్‌రత్న

బజ్‌రంగ్‌ పూనియా (రెజ్లింగ్‌),

దీపా మాలిక్‌ (పారా స్పోర్ట్స్‌)

 

ద్రోణాచార్య

విమల్‌కుమార్‌ (బ్యాడ్మింటన్‌)

సందీప్‌ గుప్తా (టేబుల్‌ టెన్నిస్‌)

మొహిందర్‌ సింగ్‌ (అథ్లెటిక్స్‌)

జీవిత సాఫల్య కోచ్‌

మెర్జ్‌బన్‌ పటేల్‌ (హాకీ)

రాంబీర్‌ సింగ్‌ ఖోఖర్‌ (కబడ్డీ)

సంజయ్‌ భరద్వాజ్‌ (క్రికెట్‌)

 

అర్జున

రవీంద్ర జడేజా (క్రికెట్‌)

సాయిప్రణీత్‌ (బ్యాడ్మింటన్‌)

తజిందర్‌ సింగ్‌ తూర్‌ (అథ్లెటిక్స్‌)

మహ్మద్‌ అనాస్‌ (అథ్లెటిక్స్‌)

సోనియా లాథర్‌ (బాక్సింగ్‌)

ఎస్‌. భాస్కరన్‌ (బాడీబిల్డింగ్‌)

చింగ్లెన్‌సనా సింగ్‌ (హాకీ)

అజయ్‌ ఠాగూర్‌ (కబడ్డీ)

గౌరవ్‌ సింగ్‌ గిల్‌ (మోటార్‌ స్పోర్ట్స్‌)

ప్రమోద్‌ భగత్‌ (పారా బ్యాడ్మింటన్‌)

అంజుమ్‌ మౌద్గిల్‌ (షూటింగ్‌)

హర్మీత్‌ రాజుల్‌ దేశాయ్‌ (టీటీ)

పూజా దండా (రెజ్లింగ్‌)

ఫవాద్‌ మీర్జా (ఈక్వెస్ట్రియన్‌)

గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు (ఫుట్‌బాల్‌)

పూనమ్‌ యాదవ్‌ (క్రికెట్‌)

స్వప్న బర్మన్‌ (అథ్లెటిక్స్‌)

సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ (పారా అథ్లెటిక్స్‌)

సిమ్రన్‌సింగ్‌ షేర్‌ గిల్‌ (పోలో)

 

ధ్యాన్‌చంద్‌

మాన్యుయెల్‌ ఫెడ్రిక్స్‌ (హాకీ)

అరూప్‌ బసక్‌ (టీటీ)

మనోజ్‌ కుమార్‌ (రెజ్లింగ్‌)

నితిన్‌ కీర్తనే (టెన్నిస్‌)

లాల్‌రెమ్‌ సంగా (ఆర్చరీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అవార్డుల జాబితా"

Post a Comment