సీఎం కప్‌ షెడ్యూలు విడుదల

కాకినాడ: విజయవాడ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 2019 నుంచి ఆగస్టు 2020 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించే ఏపీ సీఎం కప్‌ క్రీడా పోటీల షెడ్యూలు విడుదలయిందని డీఎ్‌సఏ సీఈవో బి.విజయభాస్కర్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 


సంవత్సరాలపైబడిన పురుషులు, మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. ఆగస్టు 2019 శ్రీకాకుళంలో వాలీబాల్‌, సెప్టెంబరులో విజయనగరంలో ఖోఖో, అక్టోబరులో విశాఖలో ఫుట్‌బాల్‌, నవంబరులో పశ్చిమగోదావరిలో త్రోబాల్‌, 


డిసెంబరులో తూర్పు గోదావరిలో నెట్‌బాల్‌, 2020 జనవరిలో గుంటూరులో హ్యాండ్‌బాల్‌, ఫిబ్రవరిలో ప్రకాశంలో కబడ్డీ, మార్చిలో నెల్లూరులో బాల్‌ బ్యాడ్మింటన్‌, ఏప్రియల్‌లో చిత్తూరులో బాస్కెట్‌బాల్‌, మేలో అనంతపురంలో సాఫ్ట్‌బాల్‌, జూన్‌లో కడపలో హాకీ, జూలైలో కర్నూలులో సెపక్‌తక్ర, ఆగస్టులో కృష్ణలో బేస్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలు 


జరుతాయన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఎం కప్‌ షెడ్యూలు విడుదల"

Post a Comment