జీతాలు అందలేదు..
- ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి
ఒకటవ తేది వస్తోందంటేనే జీతాల కోసం ఎదురుచూడటం పరిపాటి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం (ఆగస్టు ఒకటి) జీతాలు అందలేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొద్దిమందికి, పొరపాటున జీతాలు రాలేదేమోనని తొలుత భావించారు.

అయితే, మధ్యాహ్నానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులెవరికి జీతాలు అందలేదని స్పస్టమైంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదే జీతాలు ఇస్తారని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి మాత్రం 10 నుండి 15 తేదీలలో ఇస్తారని చెబుతున్నారు. దానికి భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సారి జీతాలు రాకపోవడంతో పాటు, ఉన్నతాధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో గందరగోళం నెలకొంది
రాష్ట్ర ఆర్థికస్థితి నుండి, నవరత్నాలు, బడ్జెట్ సమావేశాల వరకు ఉద్యోగుల్లో చర్చ సాగింది. ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఈ విషయమై ప్రజాశక్తి సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వంలోఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, ఫలితంగా బిల్లుల తుది విడత పరిష్కారం జాప్యమవుతోందని చెప్సారు. శుక్ర లేదా శని వారాల్లో సమస్య పరిష్కారమవుతుందని ఒక అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
0 Response to "జీతాలు అందలేదు.."
Post a Comment